అస్వస్థతకు గురైన అద్వానీ

బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత ఐదు రోజులుగా ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం అద్వానీ స్వగృహంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగబోవని, జెండా వందనం కూడా ఉండబోదని ఆయన కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. మరోవైపు ఆయన అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న బీజేపీ నేతలు ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 7:49 pm, Wed, 14 August 19