NV Ramana: ఇవాళే జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ.. చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రత్యక్ష ప్రసారం
CJI NV Ramana Retirement: కోర్టుల్లో మౌలిక సదుపాయాలు, న్యాయమూర్తుల నియామకాలపై ప్రత్యేకంగా పని చేశానని జస్టీస్ ఎన్వీరమణ చెప్పారు. సుప్రీంకోర్టు, కొలీజియంలో తనకు అన్ని విధాలుగా సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
CJI NV Ramana Retirement : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఈరోజు పదవీ విరమణ చేస్తున్నారు. పలు కీలక కేసులను జస్టిస్ ఎన్వీ రమణ విచారించారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాలు, న్యాయమూర్తుల నియామకాలపై ప్రత్యేకంగా పని చేశానని జస్టీస్ ఎన్వీరమణ చెప్పారు. సుప్రీంకోర్టు, కొలీజియంలో తనకు అన్ని విధాలుగా సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. న్యాయ వ్యవస్థ అవసరాలను తీర్చిదిద్దేందుకు ఎన్వీరమణ విశేషంగా కృషి చేశారని పలువురు న్యాయవాదులు ప్రశంసించారు. భారత ప్రధాన న్యాయమూర్తుల్లో ఎన్వీరమణ అత్యుత్తమమమైనవారని కొనియాడారు. అధ్భుతమైన ప్రగతిశీల దృక్పధం ఉన్న ఆయన న్యాయవ్యవస్థ అవసరాలను వేగంగా తీర్చగలిగారని ప్రశంసించారు.
కాగా.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పదవీ విరమణ సందర్భంగా.. చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రోసిడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ రాజకీయ పార్టీల ఉచిత హామీలపై విచారణ ప్రారంభించారు. పదవీ విరమణ చివరి రోజు కీలక తీర్పును ఇచ్చారు.
రాజకీయ పార్టీల ఉచిత హామీలపై ఇప్పటికే పలు సూచనలు చేసిన జస్టిస్ ఎన్వీ రమణ.. త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. త్రిసభ్య ధర్మాసనాన్ని కొత్త సీజేఐ ఉదయ్ ఉమేశ్ లలిత్ ఏర్పాటు చేస్తారని ప్రకటించారు. దీంతోపాటు అఖిలపక్షం, నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయాలని తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలిపారు.