Dwaraka Temple: ద్వారకా శ్రీకృష్ణుని ఆలయంపై పిడుగుపాటు..త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

Dwaraka Temple: గుజరాత్ రాష్ట్రంలో ద్వారకాలో ప్రసిద్ది చెందిన శ్రీకృష్ణుని(ద్వారకాధీష్) ఆలయ శిఖరంపై ఉండే జెండా స్తంభానికి మంగళవారం మెరుపు(పిడుగు) దెబ్బ తగిలింది.

Dwaraka Temple: ద్వారకా శ్రీకృష్ణుని ఆలయంపై పిడుగుపాటు..త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
Dwaraka Temple

Dwaraka Temple: గుజరాత్ రాష్ట్రంలో ద్వారకాలో ప్రసిద్ది చెందిన శ్రీకృష్ణుని(ద్వారకాధీష్) ఆలయ శిఖరంపై ఉండే జెండా స్తంభానికి మంగళవారం మెరుపు(పిడుగు) దెబ్బ తగిలింది. అయితే, ఈ సంఘటనలో ఆలయానికి ఎటువంటి నష్టం జరగలేదు. ఆలయం గోడలు మాత్రం పూర్తిగా నల్లగా మారిపోయాయి. జెండాపై మెరుపులు పడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆలయం చుట్టూ స్థానికుల గృహాలు ఉంటాయి. ఈ నేపధ్యంలో ఈ మెరుపు ఆలయాన్ని తాకడం వలన ఎటువంటి నష్టం వాటిల్లలేదు. అదే ఆ నివాస ప్రాంతాల్లో ఇది తాకి ఉంటే..పెద్ద నష్టం జరిగి ఉండేది.

ద్వారకాధీష్ ఆలయానికి పైన ఉన్న జెండాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని 52 గజ్ ధ్వాజా అంటారు. భారతదేశంలో 52 గజాల జెండాను రోజుకు 3 సార్లు ఎత్తే ఏకైక ఆలయం ఇదే. ఈ జెండా పై భక్తులలో చాలా గౌరవం ఉంటుంది. ఈ ఆలయంలోని ఏ భాగాన్నైనా మెరుపులు తాకడం ఇదే మొదటిసారి అని స్థానికులు అంటున్నారు. ద్వారకాధీష్ నగర ప్రజలను పెద్ద ప్రమాదం నుండి రక్షించాడని స్థానికులు చెప్పుకుంటున్నారు.

ఆలయం పైభాగంలో ఉన్న 52 గజాల జెండా మెరుపు కారణంగా దెబ్బతింది. మెరుపు కారణంగా ఆలయానికి ఎటువంటి నష్టం జరగలేదని ద్వారక ఎస్‌డిఎం నిహార్ భటారియా చెప్పారు. ఈ సంఘటనపై ఆయన మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం మెరుపు సంఘటన తర్వాత ఆలయ ప్రాంగణంలో అధికారులు పరిశీలన చేశారని చెప్పారు. మెరుపులతో ఆలయానికి ఎటువంటి నష్టం జరగలేదన్నారు. జెండా మాత్రమే దెబ్బతిందాని తెలిపారు. పరిశీలన పూర్తి అయిన తరువాత, ఆలయ కార్యకలాపాలు మామూలుగానే జరుగుతున్నాయని ఆయన వివరించారు.

ద్వారకా ద్వారకాధీష్ ఆలయం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకాలోని గోమతి నది ఒడ్డున ఉంది. దీనిని జగత్ మందిరం అని కూడా అంటారు. శ్రీకృష్ణుడికి అంకితం చేసిన ద్వారకాధీష్ ఆలయం భారతదేశంలోని ప్రముఖ గొప్ప ఆలయంలో ఒకటి. రామేశ్వరం, బద్రీనాథ్, పూరి తరువాత హిందువుల నాలుగు పవిత్ర తీర్థయాత్రలలో ఇది ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు ద్వారకాధీష్ ఆలయాన్ని సందర్శించడానికి వస్తారు.

ద్వారకాధీష్ ఆలయం సుమారు 2200 సంవత్సరాల పురాతనమైన పుణ్యక్షేత్రం. దీనిని వజ్రనాబ్ నిర్మించారు. ఇందులో కృష్ణుడికి అంకితం చేసిన దేవాలయాలు, సుభద్ర, బలరాముడు, రేవతి, వాసుదేవ, రుక్మిణితో సహా అనేక దేవతలు ఉన్నారు. జన్మాష్టమిలో, ఆలయాన్ని వధువులా అలంకరించి, కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ పండుగను చూడటానికి లక్షలాది మంది వస్తారు.

ఇక రాజస్థాన్ లోని జైపూర్‌లో ఆదివారం కురిసిన భారీ వర్షాల మధ్య జైపూర్‌లో పిడుగు కారణంగా 11 మంది మరణించారు , అమెర్ మహల్‌లోని వాచ్ టవర్‌లో మెరుపులు సంభవించాయి. ఇక్కడ తిరుగుతున్న 35 మందికి పైగా పర్యాటకులు అందులో చిక్కుకున్నారు. వాస్తవానికి, వాతావరణంలో మార్పు తరువాత, అమెర్ కొండలను సందర్శించడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. ఫోటోగ్రఫీ, సెల్ఫీల ప్రక్రియ ఇక్కడ జరుగుతుండగా అకస్మాత్తుగా పిడుగు పడింది.

Also Read: Currency Notes Missing: హై సెక్యూరిటీ ఉన్నా.. కొత్త రూ.500 నోట్లు మాయం.. నాసిక్ ప్రెస్‌లో కలకలం..

Drone Challenge: బోర్డర్‌లో టెన్షన్‌..టెన్షన్‌..! అర్నియా సెక్టార్‌లో డ్రోన్లు.. పుల్వామా జిల్లా కేంద్రంలో కాల్పులు..

 

Click on your DTH Provider to Add TV9 Telugu