Delhi: లోక్ సభను కుదిపేస్తున్న నీట్ అంశం.. వాడి వేడిగా చర్చ..

లోక్ సభలో పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. నీట్ వ్యవహారంపై చర్చ జరగాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అయితే రాష్టపతి ధన్యవాద తీర్మానంపై చర్చించాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్షాన్ని కోరుతున్నారు. ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పార్లమెంట్ సమావేశాలు జూన్ 1 నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం జరిపేందుకు అధికార పక్షం సిద్దమైంది. ఈ క్రమంలోనే నీట్ పేపర్ లీకేజీపై చర్చకు పట్టుబట్టింది ప్రతిపక్షం.

Delhi: లోక్ సభను కుదిపేస్తున్న నీట్ అంశం.. వాడి వేడిగా చర్చ..
Mp Rahul Gandhi
Follow us

|

Updated on: Jul 01, 2024 | 1:58 PM

లోక్ సభలో పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. నీట్ వ్యవహారంపై చర్చ జరగాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అయితే రాష్టపతి ధన్యవాద తీర్మానంపై చర్చించాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్షాన్ని కోరుతున్నారు. ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పార్లమెంట్ సమావేశాలు జూన్ 1 నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం జరిపేందుకు అధికార పక్షం సిద్దమైంది. ఈ క్రమంలోనే నీట్ పేపర్ లీకేజీపై చర్చకు పట్టుబట్టింది ప్రతిపక్షం. అయితే రాష్ట్రపతి అంశం చర్చించేంత వరకూ ఇతర అంశాలపై చర్చ జరగడం సభా సాంప్రదాయం కాదని స్పీకర్ సూచించారు. అలాగైతే రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం తరువాత వెంటనే నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఒకరోజు పూర్తిగా సుదీర్ఘ చర్చ జరగాలని కోరారు ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ. ఈ అంశంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జోక్యం చేసుకున్నారు. నిబంధనల ప్రకారమే సభ జరుగుతుందని తెలిపారు. ఇలా వాదప్రతివాదాల మధ్యలోక్ సభలో వాడీవేడిగా చర్చ జరుగుతోంది.

ఇక ఇదే సమయంలో రాజ్యసభలోనూ నీట్ వ్యవహారంలో అధికారపక్షంపై విపక్షం విరుచుకుపడుతోంది. ప్రధాని మోదీ టార్గెట్‌గా ఖర్గే విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజలను మోసగించేలా ప్రధాని మోదీ ఎన్నో నినాదాలు ఇచ్చారన్నారు. ఇన్ని నినాదాలు ఇచ్చిన వ్యక్తి.. మణిపుర్‎లో మంటలు రగులుతుంటే అటువైపు చూడలేదని విమర్శించారు. ఎన్నో ఎన్నికల సభల్లో మాట్లాడారు కానీ.. మణిపూర్‌వైపు మాత్రం మోదీ వెళ్లలేదన్నారు విపక్షనేత మల్లిఖర్జున ఖర్గే. 2024 సాధారణ ఎన్నికలు అహంకారాన్ని దించిన ఎన్నికలని పేర్కొన్నారు. వారి అహంకారాన్నిప్రజలు పూర్తిగా దించేశారని ఎద్దేవా చేశారు. 17మంది కేంద్ర మంత్రులు ఈ ఎన్నికల్లో ఓడిపోయారని గుర్తు చేశారు. రైతులను కించపరిచిన మంత్రిని ప్రజలు చిత్తుగా ఓడించారన్నారు. తమ కూటమిని అహంకారమైనదిగా అభివర్ణించారు కానీ ఇప్పుడు వారి అహంకారమే కూలిపోయిందని ఘాటుగా స్పందించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వామ్మో..! వీటితో అంత ప్రమాదమా.. తరచూ ఉపయోగిస్తే అంతే సంగతులు..
వామ్మో..! వీటితో అంత ప్రమాదమా.. తరచూ ఉపయోగిస్తే అంతే సంగతులు..
పర్వతాలు, జలపాతాలు దాటుతూ కొండ గుహాల్లో దూరిన రైలు..!అద్భుతదృశ్యం
పర్వతాలు, జలపాతాలు దాటుతూ కొండ గుహాల్లో దూరిన రైలు..!అద్భుతదృశ్యం
స్కాలర్‌షిప్‌ కోసం తండ్రి మరణించాడని నకిలీ సర్టిఫికెట్‌ !!
స్కాలర్‌షిప్‌ కోసం తండ్రి మరణించాడని నకిలీ సర్టిఫికెట్‌ !!
ఇన్‌స్టాలో విరిగిన పన్ను చూసి సోదరుడిని గుర్తుపట్టిన మహిళ
ఇన్‌స్టాలో విరిగిన పన్ను చూసి సోదరుడిని గుర్తుపట్టిన మహిళ
ఐస్‌క్రీంలో మనిషి చేతి వేలు.. మిస్టరీని ఛేదించిన పోలీసులు
ఐస్‌క్రీంలో మనిషి చేతి వేలు.. మిస్టరీని ఛేదించిన పోలీసులు
ఎయిర్‌టెల్ ప్రీ పెయిడ్, పోస్ట్‌ పెయిడ్ ధరల పెంపు
ఎయిర్‌టెల్ ప్రీ పెయిడ్, పోస్ట్‌ పెయిడ్ ధరల పెంపు
సొరకాయా.. మజాకా !! బోలెడన్ని ప్రయోజనాలు
సొరకాయా.. మజాకా !! బోలెడన్ని ప్రయోజనాలు
భర్త బర్త్‌డే పార్టీని ఏర్పాటు చేసిన భార్య.. మెచ్చుకోలేదని కోపంతో
భర్త బర్త్‌డే పార్టీని ఏర్పాటు చేసిన భార్య.. మెచ్చుకోలేదని కోపంతో
ఏపీ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్.... ఆ ప్రాంతాల్లో...
ఏపీ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్.... ఆ ప్రాంతాల్లో...
ఆజామూ.. నువ్వో చెత్త ప్లేయర్.. నేపాల్ టీంలోనూ నీకు ప్లేస్ వేస్ట్
ఆజామూ.. నువ్వో చెత్త ప్లేయర్.. నేపాల్ టీంలోనూ నీకు ప్లేస్ వేస్ట్