AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SmartGold: ధన్‌తేరస్‌ వేళ ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్‌.. కేవలం 10 రూపాయలకే బంగారం..!

- దీపావళి పండగ సీజన్‌ మొదలైంది. సాధారణంగా, దీపావళి సమయంలో బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. అయితే ఇప్పుడు బంగారం ధర సరికొత్త గరిష్టానికి చేరడంతో మధ్యతరగతి ప్రజలకు బంగారం కొనడం సవాల్‌గా మారింది.

SmartGold: ధన్‌తేరస్‌ వేళ ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్‌.. కేవలం 10 రూపాయలకే బంగారం..!
Jio Smartgold
Balaraju Goud
|

Updated on: Oct 29, 2024 | 3:04 PM

Share

ధన్‌తేరస్‌ సందర్భంగా బంగారం కొనడానికి సెంటిమెంట్‌ రోజుగా భావిస్తుంటారు. మీరు కూడా ధన్‌తేరస్‌లో బంగారం కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ వార్త మీకోసమే..! ధన్‌తేరస్ సందర్భంగా, ముఖేష్ అంబానీ కంపెనీ గొప్ప ఆఫర్‌లను అందిస్తోంది. ఆఫర్ కింద కేవలం 10 రూపాయలకే బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లనవసరం లేదు, మీ బంగారాన్ని ఇంట్లో కూర్చోని కొనుగోలు చేయొచ్చు..

దీపావళికి ముందు, ధన్‌తేరస్ సందర్భంగా, ముఖేష్ అంబానీ కంపెనీ జియో ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్ తన కొత్త స్కీమ్ “స్మార్ట్ గోల్డ్”ను ప్రారంభించింది. ఈ పథకం కింద, మీరు డిజిటల్ పద్ధతిలో బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు, తద్వారా మీ బంగారం కూడా సురక్షితంగా ఉంటుంది. SmartGold పథకం కింద, వినియోగదారులు బంగారంపై తమ పెట్టుబడిని ఎప్పుడైనా నగదు, బంగారు నాణేలు లేదా ఆభరణాలుగా మార్చుకోవచ్చు.

ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, మీరు దీని కోసం వేల లేదా లక్షల రూపాయలు ఖర్చు చేయనవసరం లేదు మీరు కేవలం 10 రూపాయలకే బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ముఖేష్ అంబానీ జియో ఫైనాన్స్ యాప్ ద్వారా స్మార్ట్ గోల్డ్ స్కీమ్‌లో రెండు మార్గాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. కస్టమర్లు మొత్తం పెట్టుబడి మొత్తాన్ని నిర్ణయించుకోవచ్చు. లేదంటే బంగారం బరువును బట్టి బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. భౌతిక బంగారం డెలివరీ 0.5 గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ హోల్డింగ్‌లకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది. 0.5 గ్రాములు, 1 గ్రాములు, 2 గ్రాములు, 5 గ్రాములు, 10 గ్రాముల విలువలలో అందుబాటులో ఉంటుంది. మీరు నేరుగా బంగారు నాణేలను కొనుగోలు చేసే సదుపాయాన్ని కల్పించింది. అంతేకాదు హోమ్ డెలివరీ సదుపాయాన్ని కూడా అందిస్తోంది జియో ఫైనాన్స్.

స్మార్ట్ గోల్డ్ పథకం కింద, వినియోగదారులు 24 క్యారెట్ల బంగారాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది సురక్షితమైన బీమా వాల్ట్‌లో ఉంటుంది. దీనివల్ల బంగారం భద్రంగా ఉండటమే కాకుండా దొంగతనం భయం కూడా ఉండదు. యాప్ సహాయంతో మీకు కావలసినప్పుడు బంగారం ప్రత్యక్ష ధరను చూడవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..