AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Muhurat trading: ఆ సమయంలో స్టాక్ కొనడం చాలా మంచిది..దీపావళికి ముహూర్తం ట్రేడింగ్..!

భారతీయ సంప్రదాయంలో దీపావళి చాలా విశిష్టమైన పండగ. మిగిలిన పండగలతో పోల్చితే దీనికి మరింత ప్రత్యేకత ఉంటుంది. దీపావళికి బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడం వల్ల సంపద పెరుగుతుందని మనందరి నమ్మకం. అలాగే ఈ రోజు షేర్లు కొనడం, పెట్టుబడి పెట్టడానికి మంచిదని చాలా మంది భావిస్తారు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ లో ముహూర్తం ట్రేడింగ్ జరుగుతుంది.

Muhurat trading: ఆ సమయంలో స్టాక్ కొనడం చాలా మంచిది..దీపావళికి ముహూర్తం ట్రేడింగ్..!
Stock MarketImage Credit source: Reuters/Francis Mascarenhas
Nikhil
|

Updated on: Oct 29, 2024 | 3:00 PM

Share

ప్రధాన స్టాక్ ఎక్స్చేంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఈ రోజు ప్రత్యేకంగా ఒక గంట పాటు ట్రేడింగ్ నిర్వహిస్తాయి. దీన్నే ముహూర్తం ట్రేడింగ్ అంటారు. ఈ దీపావళికి కూడా ముమూర్తం ట్రేడింగ్ కు సమయం ఫిక్స్ చేశారు. దీపావళి సందర్భంగా స్టాక్ మార్కెట్ కు సెలవైనప్పటికీ ఇన్వస్టర్ల కోసం ఒక గంట పాటు తెరుస్తారు. ఆ సమయంలో చాలా మంది స్టాక్ లను కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది నవంబర్ 1వ తేదీన ముహూర్తం ట్రేడింగ్ జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకూ ఒక్కగంట పాటు అవకాశం ఉంటుంది. దీనికి ముందుగా సాయంత్రం 5.45 నుంచి 6 గంటల వరకూ అవగాహన సెషన్ నడుస్తుంది.

ముహూర్తం ట్రేడింగ్ సమయంలో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం మంచిదని చాలామంది భావిస్తారు. దానికి అనుగుణంగానే దీపావళికి గంట పాటు ట్రేడింగ్ నిర్వహించనున్నారు.  హిందూ మత సంప్రదాయాల ప్రకారం దీపావళి నుంచి నూతన సంవత్సవం ప్రారంభమవుతుంది. దీన్నే సంవత్ అంటారు. ప్రస్తుతం సంవత్ 2080 జరుగుతోంది. దీపావళి నుంచి సంవత్ 2081 మొదలవుతుంది. ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి ఇదే అనువైన సమయమని పెద్దలు చెబుతున్నారు. ఈ సమయంలో లక్ష్మీపూజ తర్వాత షేర్ బ్రోకర్లు ఒక గంట ట్రేడింగ్ చేస్తారు. ఈ సంప్రదాయం 1957లో బాంబే స్టాక్ ఎక్స్చేంజీలో, 1992 నుంచి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలో మొదలైంది.

హెచ్ డీఎఫ్ సీ సెక్యూరిటీస్

హెచ్ డీఎఫ్ సీ సెక్యూరిటీస్ సంస్థ పెట్టుబడిదారుల కోసం కొన్ని స్టాక్ లను సూచించింది. ముహూర్తం ట్రేడింగ్ లో వీటిలో పెట్టుబడులు పెట్టడం లాభదాయమని తెలిపింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, జేకే లక్ష్మి సిమెంట్, జ్యోతీ ల్యాబ్స్ , ఎల్ అండ్ టీ ఫైనాన్స్, నాల్కో, నవీన్ ఫ్లోరిన్, ఎన్సీసీ లిమిటెడ్ , పీఎన్ బీ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు కొనుగోలు చేస్తే బాగుటుందని సూచించింది.

ఇవి కూడా చదవండి

ఆనంద రాఠీ

దేశీయ బ్రోకరేజీ సంస్థ ఆనంద్ రాఠీ కూడా ఇన్వెస్టర్లకు కొన్ని షేర్లు కొనుగోలు చేయాలని సూచించింది. వీటిలో ఎన్ఎఫ్సీఐ, ఐఆర్బీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్, జూపిటర్ వ్యాగన్స్, హింద్ జింక్, టాటా టెక్, గార్డెన్ రీచ్ షిప్ అండ్ ఇంజి, బీఈఎంఎల్ ఉన్నాయి.

సిస్టమాటిక్స్

పీఎన్ బీ హౌసింగ్ ఫైనాన్స్, శ్రీరామ్ ప్రాపర్టీస్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, వన్ 91 కమ్యూనికేషన్స్, ప్రోటీన్ ఇగోవ్ టెక్నాలజీస్, జీఎంఆర్ విమానాశ్రయాల మౌలిక సదుపాయాలు, లెమన్ ట్రీ హోటల్స్, నేషనల్ అల్యూమినియం కంపెనీ, జొమాటో, జాష్ ఇంజినీరింగ్ ఉన్నాయి.

షికా గ్రూప్

ఆషికా బ్రోకరేజీ సంస్థ ఇన్వెస్టర్లకు పలు స్టాక్ లకు సూచించింది. వాటిలో ఓఎన్జీసీ, కేన్స్ టెక్నాలజీ, ఎరిస్ లైఫ్ సైనెన్స్, ఇస్టెక్ హెవీ ఇంజినీరింగ్, నజారా టెక్నాలజీస్, ఈఎంఎస్, యాక్సిస్కేడ్ టెక్నాలజీ ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..