AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Masjid: అయోధ్యలో మసీదు నిర్మాణానికి జనవరి 26వ తేదీన శంకుస్థాపన.. ప్రకటించిన ట్రస్ట్ సభ్యులు..

దశాబ్ధాల తరబడి సాగిన అయోధ్య రామమందిరం, బాబ్రీ మసీద్ వివాదానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో ఎండ్ కార్డ్ పడిన దరిమిలా అయోధ్యలో..

Ayodhya Masjid: అయోధ్యలో మసీదు నిర్మాణానికి జనవరి 26వ తేదీన శంకుస్థాపన.. ప్రకటించిన ట్రస్ట్ సభ్యులు..
Shiva Prajapati
|

Updated on: Dec 18, 2020 | 8:58 AM

Share

దశాబ్ధాల తరబడి సాగిన అయోధ్య రామమందిరం, బాబ్రీ మసీద్ వివాదానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో ఎండ్ కార్డ్ పడిన దరిమిలా అయోధ్యలో బాబ్రీ మసీద్‌కు బదులుగా మరో మసీద్ నిర్మాణానికి పునాది రాయి పడనుంది. మసీదు నిర్మాణానికి శంకుస్థాపన ముహూర్తంగా జనవరి 26 అంటే భారత ఘనతంత్ర దినోత్సవం రోజును ఫిక్స్ చేశారు. సున్నీ వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసిన ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఈ విషయాన్ని ప్రకటించింది. అలాగే ఈ నిర్మాణానికి సంబంధించి బ్లూ ప్రింట్‌ను ఈనెల 19వ తేదీన విడుదల చేయనున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

అయోధ్యలోని దన్నీపూర్‌ గ్రామంలో మసీదు కోసం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఈ స్థలంలో మసీదు నిర్మాణాన్ని చేపడుతున్నారు. కాగా, అయోధ్య మసీదు కాంప్లెక్స్‌లో మసీదుతో పాటు 300 పడకల సామర్థ్యం గల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, లైబ్రరీ, కమ్యూనిటీ కిచెన్ ఉండబోతున్నాయని ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు. ఇక బాబ్రీ మసీదు కంటే పెద్దగా.. ఏకకాలంలో 2వేల మంది నమాజ్ చేసుకునే వీలుగా దీని నిర్మాణం ఉంటుందన్నారు.

ఇదిలాఉండగా, అయోధ్య రామమందిర నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇక రామమందిరం నిర్మాణం పూర్తిగా స్వదేశీ నిధులతోనే జరుగుతుందని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ స్పష్టం చేసింది.

Also read:

Andhra Pradesh Govt: నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం.. కీలక అంశాలపై చర్చించే అవకాశం..

Araku Valley: టూరిస్టులకు శుభవార్త.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ట్రైన్ వచ్చేసింది..