Kiren rijiju: సింగర్‌గా అవతారమెత్తిన కేంద్ర మంత్రి.. పాటతో అదరగొట్టిన కిరణ్ రిజిజు..
కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తన కళను ప్రదర్శించారు. ఓ కార్యక్రమంలో పాట పాడి అక్కడికి వచ్చిన వారిని అలరింప చేశారు. యువ అధికారులతో నిర్వహించిన కార్యక్రమంలో తనదైన గానంతో అదరగొట్టారు. అరుణాచల్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన సివిల్
కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తన కళను ప్రదర్శించారు. ఓ కార్యక్రమంలో పాట పాడి అక్కడికి వచ్చిన వారిని అలరింప చేశారు. యువ అధికారులతో నిర్వహించిన కార్యక్రమంలో తనదైన గానంతో అదరగొట్టారు. అరుణాచల్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన సివిల్ సర్వీసెస్ యువ అధికారులకు ఏడాది శిక్షణ ముగిసింది. వారికి ఇటీవల ముస్సోరిలోని లాల్‌బహదూర్‌శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రంలో తన పాటతో అందరినీ ఉత్సాహపరిచారు రిజిజు. ఎప్పటికప్పుడు ఫిట్‌నెస్ వీడియోలను పోస్ట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే రిజిజు.. తన పాటకు సంబంధించిన ఈ వీడియోని ట్విటర్‌లో పంచుకున్నారు. 1981లో వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘యారానా’ చిత్రంలోని ‘తేరే జైసా యార్ కహాన్’ పాట ఆలపించి అందరినీ అలరించారు. స్వయంగా కేంద్రమంత్రి పాడిన పాటను ఎంజాయ్ చేసిన యువ అధికారులు ‘వన్స్ మోర్..’ అంటూ సందడి చేశారు. ఈ పాటను ఆలపించడం వెనుక ఎంతో కృషి ఉందంటూ ఆయన చెప్పుకొచ్చారు.
వీడియో చూసిన నెటిజన్లు రిజిజు టాలెంట్‌ను మెచ్చుకున్నారు. ఆయనది మంచి గొంతుక అంటూ ప్రశంసించారు. కిరణ్ రిజిజు పాట ఈ ఏడాది ఫిబ్రవరిలో సైనికులతో నిర్వహించిన ఓ కార్యక్రమంలోనూ ఓ పాట ఆలపించారు. 1973లో ధుండ్ చిత్రంలో మహేంద్ర కపూర్ ఆలపించిన పాటతో ఆకట్టుకున్నారు. నేను గాయకుడినికాదు.. కానీ మన వీర జవాన్ల కోసం పాడుతున్నందుకు గర్వపడుతున్నా అని ట్విటర్‌లో పేర్కొంటూ అప్పట్లో ఆ వీడియోను కూడా పోస్ట్ చేశారు.
Just to please the young and smart Arunachal Civil Service Officers after completing their 1st ever Customised Training Programme at the Premier Academy for IAS, Elite Officers – ‘Lal Bahadur Shastri National Academy of Administration’ @LBSNAA_Official pic.twitter.com/INGQGfFsVs
— Kiren Rijiju (@KirenRijiju) September 23, 2021
మరిన్ని చదవండి ఇక్కడ : Super Robo Video: సూపర్ రోబోను కనిపెట్టిన అఫ్గానిస్తాన్ యువతులు..!(వీడియో)
IPL 2021 : కావ్య దిగులును కేన్ సేన తీరుస్తారా..?రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్..(వీడియో)