AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈఎంఐల వడ్డీపై ఇదే లాస్ట్ ఛాన్స్ : సుప్రీం కోర్టు

కొవిడ్ -19 మారిటోరియం నేపథ్యంలో రుణగ్రహీతలపై వడ్డీ భారం పడకుండా రెండు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, ఆర్‌బీఐ ఓ నిర్ధిష్ట విధానంతో కోర్టు ముందుకు రావాలని..

ఈఎంఐల వడ్డీపై ఇదే లాస్ట్ ఛాన్స్ : సుప్రీం కోర్టు
Pardhasaradhi Peri
|

Updated on: Sep 10, 2020 | 5:12 PM

Share

కొవిడ్ -19 మారిటోరియం నేపథ్యంలో రుణగ్రహీతలపై వడ్డీ భారం పడకుండా రెండు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, ఆర్‌బీఐ ఓ నిర్ధిష్ట విధానంతో కోర్టు ముందుకు రావాలని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. మారటోరియం వ్యవధిలో నిలిచిపోయిన ఈఎంఐలపై వడ్డీ వసూలు చేయరాదని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. కరోనా లాక్ డౌన్ వేళ ఈఎంఐల చెల్లింపుపై ఆర్‌బీఐ ఆరు నెలల మారటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మారటోరియం వ్యవధిలో నిలిచిపోయిన ఈఎంఐలపై వడ్డీ వసూలు చేస్తామని బ్యాంకులు ప్రకటించాయి. వడ్డీపై వడ్డీ వసూలు సరైంది కాదని సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసును మరోసారి వాయిదా వేసేందుకు నిరాకరించిన సర్వోన్నత న్యాయస్ధానం ఇదే చివరి అవకాశమని రెండు వారాల్లోగా రుణగ్రహీతలకు భారం పడనివిధంగా పరిష్కారంతో అఫిడవిట్‌ సమర్పించాలని కోరింది. బదులుగా రుణగ్రహీతలకు ఊరట ఇచ్చేలా బ్యాంకులతో ఉన్నతస్ధాయిలో సంప్రదింపులు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు వివరించింది. మరోవైపు సెప్టెంబర్‌ చివరివారంలో కేసు విచారణ తిరిగి ప్రారంభమయ్యేవరకూ ఆయా ఖాతాలను నిరర్ధక ఆస్తులుగా పరిగణించరాదని కోర్టు స్పష్టం చేసింది.

సింగపూర్‌లో భారతీయ 100 రూపాయల విలువ ఎంత?
సింగపూర్‌లో భారతీయ 100 రూపాయల విలువ ఎంత?
త్వరలోనే భారత్‌ - ఫ్రాన్స్‌ మధ్య బిగ్ డిఫెన్స్‌ డీల్‌..!
త్వరలోనే భారత్‌ - ఫ్రాన్స్‌ మధ్య బిగ్ డిఫెన్స్‌ డీల్‌..!
స్టార్ ప్లేయర్‌ను ఇంటికి పంపేసిన యూఏఈ.. కారణం IND, PAK సమస్యేనా?
స్టార్ ప్లేయర్‌ను ఇంటికి పంపేసిన యూఏఈ.. కారణం IND, PAK సమస్యేనా?
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒక్క క్లిక్‌తో పొలం వద్దకే యంత్రా
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒక్క క్లిక్‌తో పొలం వద్దకే యంత్రా
రైలులో అత్యవసర బెర్త్‌లు ఉంటాయని తెలుసా? ఎవరెవరికి ఇస్తారు?
రైలులో అత్యవసర బెర్త్‌లు ఉంటాయని తెలుసా? ఎవరెవరికి ఇస్తారు?
తొలిసారి అసెంబ్లీలో మాట్లాడుతూ.. దుమ్మురేపిన ఎమ్మెల్యే మైథిలి..!
తొలిసారి అసెంబ్లీలో మాట్లాడుతూ.. దుమ్మురేపిన ఎమ్మెల్యే మైథిలి..!
ఈ సినిమా ఉంటది భయ్యా..! చూస్తే ప్యాంట్ తడిసిపోవాల్సిదే..
ఈ సినిమా ఉంటది భయ్యా..! చూస్తే ప్యాంట్ తడిసిపోవాల్సిదే..
చాణక్యుడు చెప్పిన సీక్రెట్స్.. ఇంట్లోని శత్రువును ఓడించడం ఎలా..?
చాణక్యుడు చెప్పిన సీక్రెట్స్.. ఇంట్లోని శత్రువును ఓడించడం ఎలా..?
దొరికితే జాక్‌పాటే?.. అక్కడి నదిలో ఎక్కడ చూసిన బంగారం
దొరికితే జాక్‌పాటే?.. అక్కడి నదిలో ఎక్కడ చూసిన బంగారం
రేపట్నుంచి ఆర్‌ఆర్‌బీ రైల్వే ఆన్‌లైన్‌ పరీక్షలు..
రేపట్నుంచి ఆర్‌ఆర్‌బీ రైల్వే ఆన్‌లైన్‌ పరీక్షలు..