Parliament Elections: లోక్ సభ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కుమార్తె..? రాజకీయాల్లోకి రావాలంటూ పార్టీ నేతల వినతి
లాలు ప్రసాద్ యాదవ్.. ఈయన పెద్దగా పరిచయం అక్కర్లేదు. పేరు చెబితే చాలు రూపం ఇట్టే గుర్తుకొచ్చే ప్రముఖ రాజకీయ నేత. బీహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్ పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా ఏడు సంవత్సరాలు కొనసాగారు. ఆ తరువాత కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా విన్నూత్న కార్యక్రమాలను ప్రారంభించారు. అయితే ప్రస్తుతం ఈయన వారసులు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.

లాలు ప్రసాద్ యాదవ్.. ఈయన పెద్దగా పరిచయం అక్కర్లేదు. పేరు చెబితే చాలు రూపం ఇట్టే గుర్తుకొచ్చే ప్రముఖ రాజకీయ నేత. బీహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్ పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా ఏడు సంవత్సరాలు కొనసాగారు. ఆ తరువాత కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా విన్నూత్న కార్యక్రమాలను ప్రారంభించారు. అయితే ప్రస్తుతం ఈయన వారసులు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్, మొదటి కుమార్తె మిసా భారతి రాజకీయాల్లో రాణిస్తున్నారు. రానున్న రోజుల్లో రెండో కుమార్తె రోహిణీ కూడా రాజకీయాల్లోకి వస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దఫా జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీహార్ నుంచి ఆర్జేడీ పార్టీ తరఫున ఎంపీగా రాజకీయ తేరంగేట్రం చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈమె సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు. ఎంబీబీఎస్ చదువుకుంటున్న సమయంలోనే సమేష్ అనే ఇంజనీర్ని పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత తన భర్తతో కలిసి సింగపూర్ వెళ్లి స్థిరపడ్డారు. రోహిణి ఆచార్య ఎక్కడ ఉన్నా.. సోషల్ మీడియాలో బీహార్ రాజకీయాలతో పాటూ తమ ప్రాంతానికి సంబంధించిన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో తన అత్త, మామలను చూసేందుకు బీహార్ వచ్చారు. ఈ సందర్భంగా ఆమెను కలిసేందుకు వచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్ అభిమానులు, ఆర్జేడీ కార్యకర్తలు రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చేశారు. తనను కారాకాట్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా కోరారు.
పార్టీ కార్యకర్తల డిమాండ్‌ను ముందుగా తిరస్కరించినప్పటికీ తన తల్లిదండ్రుల మాట జవదాటనన్నారు. తన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు నిజంగా తనను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి, ప్రత్యక్ష రాజకీయాల్లో చూడాలనుకుంటే అభ్యంతరం చెప్పలేనని అన్నారు. ఈ మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అటు బీహార్‌లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మహిళగా, ఉన్నత విద్యావంతురాలిగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబ నేపథ్యం ఇవన్నీ ఆమెకు కలిసొచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు పరిశీలకులు. పైగా ఆమె మంచి మనసున్న వ్యక్తిగా గతంలోని ఒక సంఘటన రుజువు చేసింది. తన తండ్రికి కిడ్నీలు పాడైపోతే ఆమెకున్న రెండు కిడ్నీలలో ఒకదానిని దానం చేశారు. దీంతో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్న విషయం మరి కొన్ని నెలల్లో తేలిపోతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




