Lakhimpur Violence: ఫోరెన్సిక్‌ నివేదికలో కీలక ఆదారాలు.. లఖీంపూర్‌ ఖేరి ఘటనలో మంత్రి కుమారుడికి బిగుస్తున్న ఉచ్చు..

లఖీంపూర్‌ ఖేరి హింసాకాండలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు ఆశిశ్‌మిశ్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆందోళన చేస్తున్న రైతులపై తన కాన్వాయ్‌ను దూసుకెళ్లించిన ఆశిశ్‌ కాల్పులు..

Lakhimpur Violence: ఫోరెన్సిక్‌ నివేదికలో కీలక ఆదారాలు.. లఖీంపూర్‌ ఖేరి ఘటనలో మంత్రి కుమారుడికి బిగుస్తున్న ఉచ్చు..
Lakhimpur Violence
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 09, 2021 | 1:02 PM

Lakhimpur Violence: లఖీంపూర్‌ ఖేరి హింసాకాండలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు ఆశిశ్‌మిశ్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆందోళన చేస్తున్న రైతులపై తన కాన్వాయ్‌ను దూసుకెళ్లించిన ఆశిశ్‌ కాల్పులు కూడా జరిపినట్టు ఫోరెన్సిక్‌ నివేదిక వెల్లడించింది. రైతులపై ఆశిశ్‌మిశ్రాతో పాటు అతడి స్నేహితుడు అంకిత్‌ దాస్‌ కాల్పులు జరిపినట్టు FSL రిపోర్టు స్పష్టం చేసింది. ఈ ఘటన జరిగినప్పుడు తాను స్పాట్‌లో లేనని చెబుతున్నారు ఆశిశ్‌మిశ్రా. కాని FSL నివేదిక మాత్రం ఆయన స్పాట్‌ లోనే ఉన్నట్టు స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఆశిశ్‌మిశ్రాతో అతడి స్నేహితులను అరెస్ట్ చేశారు. లఖీంపూర్‌ ఖేరి ఘటనలో ఆశిశ్‌మిశ్రా కాన్వాయ్‌ దూసుకెళ్లిన ఘటనలో 8 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసు విచారణను ప్రస్తుతం యూపీ సిట్‌ దర్యాప్తు చేస్తోంది.

అయితే నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తోందని సుప్రీంకోర్టు సిట్‌ విచారణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐకి ఈ కేసు విచారణను అప్పగించడం ఇష్టం లేదన్న సుప్రీంకోర్టు ఇద్దరు హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిలతో విచారణకు ఆలోచిస్తునట్టు తెలిపింది. 10 రోజుల గడువు ఇచ్చినప్పటికి యూపీ ప్రభుత్వం నుంచి నివేదిక అందలేదని , అందుకే ఇద్దరు రిటైర్డ్‌ హైకోర్టు జడ్జిలతో ఈ ఘటనపై విచారణకు ఆలోచిస్తునట్టు తెలిపారు సీజేఐ ఎన్వీరమణ.

ఈ ఘటనపై నమోదైన రెండు ఎఫ్‌ఐఆర్‌లను కలిపి విచారించడం .. ప్రధాన నిందితుడిని కాపాడేందుకే అన్న అనుమానాలు కలుగుతున్నాయని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యూపీ హైకోర్టు కాకుండా పంజాబ్‌ హైకోర్టు రిటైర్డ్ హైకోర్టు జడ్జిలు రాకేశ్‌కుమార్‌ , జస్టిస్‌ రంజిత్‌సింగ్‌తో లఖీంపూర్‌ ఖేరి ఘటనపై దర్యాప్తు జరిపితే బాగుంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

ఇవి కూడా చదవండి: Rafale Deal: మధ్యవర్తికి డసాల్ట్‌ ఏవియేషన్‌ రూ.481 కోట్ల లంచం.. మరోసారి తెరపైకి వచ్చిన రాఫెల్‌ డీల్‌ భూతం..

Sania Mirza Video: భర్త షాయబ్ మాలిక్ సిక్సర్ల మోత.. పాక్ క్రికెటర్ ఆటను ఎంజాయ్ చేసిన సానియా..