AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Pandemic: డాక్టర్ మానవత్వం..కరోనా పేషేంట్ కు పుట్టిన బిడ్డకు తన శ్వాసతో ప్రాణం పోసిన వైనం!

కరోనా మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తోంది. చాలా చోట్ల కరోనా సోకింది అని తెలిస్తే ఆ వ్యక్తుల్ని వెలివేస్తున్నారు. ఇక కరోనాతో మరణించిన వారి మృతదేహాలను శ్మశానానికి తీసుకువెళ్ళడానికి కూడా నిరాకరిస్తున్నారు.

Corona Pandemic: డాక్టర్ మానవత్వం..కరోనా పేషేంట్ కు పుట్టిన బిడ్డకు తన శ్వాసతో ప్రాణం పోసిన వైనం!
Corona Pandemic
KVD Varma
|

Updated on: Apr 14, 2021 | 8:32 PM

Share

Corona Pandemic:  కరోనా మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తోంది. చాలా చోట్ల కరోనా సోకింది అని తెలిస్తే ఆ వ్యక్తుల్ని వెలివేస్తున్నారు. ఇక కరోనాతో మరణించిన వారి మృతదేహాలను శ్మశానానికి తీసుకువెళ్ళడానికి కూడా నిరాకరిస్తున్నారు. అదేవిధంగా కరోనా సోకినా గర్భిణీల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోంది. వీరికి చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న సంఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. కానీ, ఒక్కోసారి కొంత మంది వైద్యులు తమ ప్రాణాలను రిస్క్ లో పెట్టిమరీ ఇటువంటి వారికీ అండగా నిలవడమూ విన్నాము. అటువంటి ప్రాణదాత ఒకరు ఒక పసిప్రాణాన్ని కాపాడిన సంఘటన ఇది. వివరాలు ఇలా ఉన్నాయి. కరోనా వైరస్‌తో బాధపడుతున్న ఓ రోగి జన్మనిచ్చిన బిడ్డను రక్షించడంలో మహిళా వైద్యురాలు మానవత్వం చాటారు. ఊపిరాడక ఆ బిడ్డపడుతున్న వేదనను చూసి, తక్షణం నోటిలో నోరు పెట్టి తన శ్వాసను అందించి ప్రాణం పోశారు.

చెన్నైలోని పెరంబూరు రేల్వే స్టేషన్లో ప్రసవం కోసం ఓ గర్భిణీని ఆసుపత్రిలో చేర్చారు. అయితే, ఆమెకు కరోనా పాజిటివ్ గా పరీక్షల్లో తేలింది. దీంతో ఆమెను ప్రత్యక వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఒక అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో ఆ గర్భిణికి నెప్పులు మొదలయ్యాయి. విషయం తెలుసుకున్న డాక్టర్ ప్రియా ఆసుపత్రికి వెంటనే చేరుకున్నారు. ఆమెకు వైద్య సహాయం అందించారు. కొద్దీ గంటల తరువాత ఆమె చక్కని మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆ బిడ్డ తల్లి కరోనా పేషేంట్ కావడంతో తల్లి నుంచి బిడ్డను దూరంగా ఉంచారు. అటువంటి సమయంలో ఆ బిడ్డకు శ్వాసలో సమస్య వచ్చింది. ఈ సమయంలో డాక్టర్ ప్రియాంక బిడ్డ పరిస్థితిని గమనించి వెంటనే స్పందించారు. ఆ బిడ్డను రక్షించేందుకు ఆ బిడ్డ నోటిలో నోరు పెట్టి శ్వాస అందించారు. శ్వాస సమస్య సరి చేయడమే కాకుండా, ఆ బిడ్డను రెండు వారాల పాటు అతి జాగ్రత్తగా పరీక్షిస్తూ, వైద్య సేవ అందించారు.

డాక్టర్ ప్రియ చేసిన చికిత్సతో బిడ్డ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. మానవతా దృక్పధంతో వ్యవహరించి బిడ్డ ప్రాణాలను కాపాడిన డాక్టర్ ప్రియను ఆసుపత్రి వర్గాలు అభినందించాయి.

Also Read: ఎన్నిక కమిషన్ తీరుపై తృణమూల్ కాంగ్రెస్ ఫైర్.. వ్యవహారశైలి దయనీయం అంటూ ఈసీ ఫ్యానెల్‌కు లేఖ

ఈ సంవత్సరం జీతాలు, ఇంక్రిమెంట్లు పెరుగుతాయా..? కంపెనీలు ఏం చెబుతున్నాయి..! తెలుసుకోండి..