AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ట్రైన్ టికెట్‌ బుకింగ్‌ రూల్స్ తెలుసా? తప్పక తెలుసుకోండి.. లేదంటే ఇబ్బంది పడతారు..!

మన దేశంలో చౌకైన రవాణా వ్యవస్థల్లో రైల్వే వ్యవస్థ ప్రధానమైనది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రజలను.. రైల్వే ప్రయాణాన్నే ఎంచుకుంటారు. ఈ కారణంగానే.. ఇండియన్ రైల్వేస్ దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి వారి గమ్య స్థానాలకు చేరుస్తోంది.

Indian Railways: ట్రైన్ టికెట్‌ బుకింగ్‌ రూల్స్ తెలుసా? తప్పక తెలుసుకోండి.. లేదంటే ఇబ్బంది పడతారు..!
Train
Shiva Prajapati
|

Updated on: May 28, 2023 | 4:55 PM

Share

మన దేశంలో చౌకైన రవాణా వ్యవస్థల్లో రైల్వే వ్యవస్థ ప్రధానమైనది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రజలను.. రైల్వే ప్రయాణాన్నే ఎంచుకుంటారు. ఈ కారణంగానే.. ఇండియన్ రైల్వేస్ దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి వారి గమ్య స్థానాలకు చేరుస్తోంది. అయితే, రైలులో ప్రయాణం అంటే అంత ఈజీ కాదు. ట్రైన్స్ సరిపడా ఉన్న రూట్‌లో పెద్దగా సమస్య ఉండదు కానీ, ట్రైన్స్ సౌకర్యం పెద్దగా లేని చోట మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. సీట్ల కోసం ప్రయాణికుల మధ్య పెద్ద పెద్ద గొడవలే జరుగుతుంటాయి. ఇక రైల్వే నిబంధనలు తెలియకుండా ట్రైన్ ఎక్కిన వారు.. టీటీ చేతిలో అడ్డంగా బుక్కవుతుంటారు. నిబంధనలు తెలిసిన వారు.. ఇబ్బంది లేకుండా సాఫీగా తమ ప్రయాణాలను సాగిస్తారు. మరి ట్రైన్ టిక్కెట్, ట్రైన్ ప్రయాణానికి సంబంధించిన కీలక రూల్స్ ఇవ్వాళ మనం తెలుసుకుందాం..

ప్రయాణికులు తెలుసుకోవాల్సిన రూల్స్..

రైలులో ఒక్కో తరగతికి ఒక్కో విధంగా ఛార్జీలు, టిక్కెట్లను బుక్ చేసుకునే రూల్స్ ఉంటాయి. అయితే, కొందరు మాత్రం ప్రయాణానికి కొద్దిసేపటి ముందే టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటి సమయంలో వారికి టికెట్లు లభించవు. అందుకే.. మీ జర్నీ టైమ్, ప్రయాణించాలనుకుంటున్న ట్రైన్ టైమ్.. ఎన్ని రోజుల ముందు టిక్కెన్‌ను బుక్ చేసుకోవచ్చు? అనేది తెలుసుకోవడం తప్పనిసరి.

120 రోజుల ముందుగానే బుక్ చేసుకోవచ్చు..

ప్రయాణికులు ట్రైన్ టిక్కెట్‌ను నాలుగు నెలల ముందు బుక్ చేసుకునే సదుపాయం ఇండియన్ రైల్వేస్ కల్పించింది. రైల్వే నిబంధనల ప్రకారం.. ప్రయాణ తేదీకి 120 రోజుల ముందు మీ టిక్కెట్‌ను, సీటును రిజర్వ్ చేసుకోవచ్చు. ఇక తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రయాణ తేదీకి ఒక రోజు ముందు చేయవచ్చు. 3 ఏసీ, అంతకంటే తక్కువ తరగతికి రోజువారీ బుకింగ్ ఉదయం 10 గంటల తరువాత ప్రారంభమవుతుంది. స్లీపర్ తత్కార్ బుకింగ్ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

సాధారణ టిక్కెట్‌కి భిన్నమైన నిబంధనలు..

జనరల్ టిక్కెట్టుకు రెండు నిబంధనలు ఉన్నాయి. రైలు సాధారణ కోచ్‌లో 199 కిలోమీటర్ల వరకు ప్రయాణించాలనుకుంటే.. అదే రోజున టిక్కెట్ తీసుకోవచ్చు. ఇందులో టికెట్‌ కొనుగోలు చేసిన 3 గంటల్లోపు ప్రయాణాన్ని ప్రారంభించాలి. 200 కిలోమీటర్లు, అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించడానికి.. 3 రోజుల ముందుగానే సాధారణ టిక్కెట్‌ను కొనుగోలు చేయవచ్చు. భారతీయ రైల్వే యాప్స్, వెబ్‌సైట్‌ల ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..