Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kisan Mahapanchayat: వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు రైతుల ఉద్యమం కొనసాగుతుందిః రాకేష్ టికైత్

వ్యవసాయ చట్టాన్ని ఉపసంహరించుకుంటామని ప్రధానమంత్రి ప్రకటించినా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు శాంతించడం లేదు. పార్లమెంటులో పూర్తి స్థాయిలో బిల్లులను రద్దు చేసే వరకు రైతుల ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Kisan Mahapanchayat: వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు రైతుల ఉద్యమం కొనసాగుతుందిః రాకేష్ టికైత్
Kisan Mahapanchayat
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 22, 2021 | 8:46 PM

Farmers Protest: వ్యవసాయ చట్టాన్ని ఉపసంహరించుకుంటామని ప్రధానమంత్రి ప్రకటించినా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు శాంతించడం లేదు. పార్లమెంటులో పూర్తి స్థాయిలో బిల్లులను రద్దు చేసే వరకు రైతుల ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం లక్నోలోని ఎకో గార్డెన్‌లో యునైటెడ్ కిసాన్ మోర్చా మహాపంచాయత్‌ నిర్వహించింది. ప్రభుత్వం బిల్లు పూర్తిగా రద్దు చేసేవరకు ఆందోళన కొనసాగుతుందని BKU ప్రతినిధి రాకేష్ టికైత్ ప్రకటించారు. సంగ్రామ్ విశ్రమ ప్రకటన భారత ప్రభుత్వం చేసిందని, రైతులు కాదని అన్నారు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారం తర్వాత మాత్రమే ఉద్యమం ముగుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

పార్లమెంట్‌లో తీసుకువస్తున్న 17 చట్టాలను కూడా ఆమోదించడానికి వీలు లేదని, దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు. చర్చలు జరిపి ప్రతి అంశంపై ప్రభుత్వం మాట్లాడే వరకు రైతులు తమ ఇళ్లకు వెళ్లరని చెప్పారు. అలాగే, లఖీంపూర్‌ ఖేరి ఘటనలో కేంద్రమంత్రి అజయ్‌మిశ్రాను పదవి నుంచి తొలగించే వరకు ఉద్యమం కొనసాగుతుందని రైతుల సంఘాలు ప్రకటించాయి. లక్నో కిసాన్‌ మహాపంచాయత్‌లో కేంద్రం తీరుపై మరోసారి విరుచుకుపడ్డారు రాకేశ్‌ టికాయత్‌.

మూడు సాగు చట్టాలను రద్దు చేస్తే సరిపోదని , కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకురావాల్సిందేనని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో రైతు సంఘాలు కిసాన్‌ మహాపంచాయత్‌ను నిర్వహించాయి. బీజేపీ ప్రభుత్వం ఓ హంతకుడిని హీరో చేసే ప్రయత్నం చేస్తోందని , కేంద్ర మంత్రి అజయ్‌మిశ్రాను కేబినెట్‌ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు రైతు సంఘాల నేత రాకేశ్‌ టికాయత్‌. రైతులను హత్య చేసిన అజయ్‌మిశ్రాను కేబినెట్‌ నుంచి తొలగించే వరకు తమ ఉద్యమం కొపసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

రైతులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెబితే సరిపోదని అన్నారు రాకేశ్‌ టికాయత్‌. క్షమాపణలు చెబితే రైతుల కష్టాలు తీరవని , కనీస మద్దతు ధర లభించినప్పుడే న్యాయం జరుగుతుందని అన్నారు. కొందరిని ఒప్పించడంలో విఫలమయ్యామని ప్రధాని మోడీ అన్నారు. తరువాత రైతులకు క్షమాపణలు చెప్పారు. దేశప్రధాని క్షమాపణలు చెప్పినంత మాత్రాన రైతులకు కనీస మద్దతు ధర లభించదు. ఎంఎస్‌పీపై చట్టం తీసుకొచ్చినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు.

లక్నోలో విమానాశ్రయం కోసం 11 వందల ఎకరాల భూమిని సేకరించారని, అయితే రైతులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని రాకేష్ టికైత్ ఆరోపించారు. 1942లో భూమిని స్వాధీనం చేసుకున్నారని, ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. దానికి లెక్కలు వేస్తామని, ఈసారి వర్షాలు కురిసిన తర్వాత లక్నో విమానాశ్రయం భూముల్లో రైతులు నాట్లు వేస్తారని చెప్పారు. కష్టాల్లో ఉన్న రైతుల కోసం తప్పకుండా పోరాటం ఉంటుంది. నవంబర్ 26న ఘాజీపూర్ సరిహద్దుకు చేరుకోవాలని రైతులకు ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంటుకు ట్రాక్టర్లు బయలుదేరుతాయన్నారు. అలాగే 29వ తేదీ నుంచి రోజూ 60 ట్రాక్టర్లతో 1000 మంది వెళ్తారు. 29 నుంచి 3వ తేదీ వరకు తమ డిమాండ్లతో పాటు కొత్త చట్టాన్ని ఉపసంహరించుకునేంత వరకు యుద్ధం కొనసాగుతుందని అన్నారు.

ఆరుడిమాండ్లతో ప్రధాని మోడీకి రైతు సంఘాలు లేఖ రాశాయి. ఎంఎస్‌పీతో పాటు కొత్త విద్యుత్‌ చట్టాన్ని రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మరోవైపు మూడు వ్యవసాయ చట్టాల రద్దు చేయడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టడానికి ముసాయిదాను తయారు చేస్తున్నారు. దీనిలో కనీస మద్దతు ధరపై కూడా ప్రస్తావన ఉండే అవకాశాలున్నాయి.

Read Also…  Treasury: జగన్నాథుడి సంపద ఉన్న రత్నభాండాగారం తాళం చెవి మిస్.. స్వామివారి ఆస్తులపై నిజానిజాలు తెలియాలంటూ భక్తుల డిమాండ్