Kerala woman: పెళ్లైన మరుసటి రోజే భర్తకు షాకిచ్చిన భార్య.. బయటకు వెళ్లొస్తానని చెప్పి ప్రియురాలితో జంప్.. భర్తకు గుండెపోటు..
పెళ్లైన తర్వాత రోజునే భార్య పారిపోవడంతో భర్తకు గుండెపోటు వచ్చిన ఘటన కేరళలో జరిగింది. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో వివాహం అయిన మరుసటి రోజే భార్య ప్రియురాలితో కలిసి వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న భర్తకు గుండెపోటు వచ్చింది. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా యాంజియోప్లాస్టీ చేశారు...
పెళ్లైన తర్వాత రోజునే భార్య పారిపోవడంతో భర్తకు గుండెపోటు వచ్చిన ఘటన కేరళలో జరిగింది. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో వివాహం అయిన మరుసటి రోజే భార్య ప్రియురాలితో కలిసి వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న భర్తకు గుండెపోటు వచ్చింది. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా యాంజియోప్లాస్టీ చేశారు. త్రిస్సూర్‌లోని చెర్పు సమీపంలోని పజువిల్‌కు చెందిన 23 ఏళ్ల మహిళకు చవక్కాడ్‌కు చెందిన ఓ వ్యక్తితో అక్టోబర్ 25 పెళ్లైంది. తర్వాత రోజున భార్యాభర్తలు బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు వెళ్లిన తర్వాత భర్త మొబైల్ నుంచి ప్రియురాలికి ఫోన్ చేసి రమ్మని చెప్పింది భార్య. తర్వాత బయటకు వెళ్లివస్తానని భర్తతో చెప్పి వెళ్లిపోయింది. భార్య కోసం అతను సాయంత్రం 5 గంటల వరకు బ్యాంకు వద్దే వేచి చూశాడు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆరు రోజుల తర్వాత మదురైలో ఆమెతోపాటు ఆమె ప్రియురాలిని పట్టుకున్నారు. వారిని విచారించగా ఆసక్తకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లికి ముందే తన ప్రియురాలితో కలిసి పారిపోవాలనుకున్నానని కానీ తన తల్లిదండ్రుల ఇచ్చే బంగారు ఆభరణాలు కోసం వేచి చూశానని చెప్పింది. ఆమె ప్రియురాలితో కలిసి త్రిసూర్ నుంచి చెన్నైకి రైలు టికెట్ బుక్ చేసినట్లు విచారణలో తేలింది. కానీ రైలులో వెళ్లకుండా బస్సులో కొట్టాయంకు వెళ్లారు. మరుసటి రోజు చెన్నైకి రైలు ఎక్కారు. చెన్నై నుంచి మధురై వెళ్లి అక్కడ ఓ హోటల్లో బస చేశారు. వారు అక్కడ ఒక రోజు గడిపారు.
ద్విచక్ర వాహనంపై ఎర్నాకులం వెళ్లి 10 రోజుల పాటు అడ్వాన్స్ చెల్లించి వస్తువులు అక్కడే ఉంచి మళ్లీ మధురైకి వచ్చారు. బాలికలు మదురైలో వస్త్ర దుకాణాల్లో ఉద్యోగాలు చేస్తూ తమ జీవితాన్ని గడపాలని ప్లాన్ చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ మహిళ ప్రియురాలు కూడా కొత్తగా పెళ్లయిన మహిళేనని, పెళ్లి కోసం అందిన బంగారు ఆభరణాలను తీసుకుని పారిపోవాలని అనుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ విషయం తెలుసుకున్న భార్తకు గుండెపోటు వచ్చింది.
Read Also.. Road Safety Awareness: దేశంలో తొలిసారిగా ఈ కంపెనీ హెల్మెట్ కొంటే లక్ష ప్రమాద భీమా సౌకర్యం..