Road Safety Awareness: దేశంలో తొలిసారిగా ఈ కంపెనీ హెల్మెట్ కొంటే లక్ష ప్రమాద భీమా సౌకర్యం..
Road Safety Awareness: ప్రపంచంలో రోజు రోజుకి రోడ్డు ప్రమాదంలో గాయపడి అవయవాలు కోల్పోతున్నవారు, మరణిస్తున్నవారి సంఖ్య పెరిగిపోతుంది. ఇక రోడ్డు ప్రమాదాల్లో..
Road Safety Awareness: ప్రపంచంలో రోజు రోజుకి రోడ్డు ప్రమాదంలో గాయపడి అవయవాలు కోల్పోతున్నవారు, మరణిస్తున్నవారి సంఖ్య పెరిగిపోతుంది. ఇక రోడ్డు ప్రమాదాల్లో మన దేశం ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అయితే ప్రపంచంలో ఉన్న వాహనాల్లో మనదేశంలో ఒక శాతం మాత్రమే ఉన్నా రోడ్డు ప్రమాదాలు మాత్రం భారీగా నమోదవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే భారత దేశంలో ప్రతి గంటకు యాభై కి పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక ఈ ప్రమాదాల బారినపడిన క్షతగాత్రులు ప్రతి నాలుగు నిమిషాల్లో ఒకరు మరణిస్తున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాణాలను కాపాడేందుకు అనేక చర్యలు చేపట్టాయి. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారి భద్రతా కోసం కొన్ని రూల్స్ ను రూపొందించింది. ముఖ్యంగా మోటార్ బైక్స్ పై ప్రయాణించే వాహనదారులకు హల్మెట్ ను ధరించడం తప్పని సరి చేసింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు ఎక్కువగా హెల్మెట్ ధరించనివారే అధికంగా ఉన్నారని రూల్స్ పెట్టింది. రూల్స్ ని అతిక్రమించినవారికి జరిమానాలు వేసినా వాహనదారుల్లో నిర్లక్ష్యం పోవడంలేదు. ఈక్రమంలో దేశంలోనే తొలిసారిగా హెల్మెట్ కొంటే బీమా పాలసీ ఉచితం అంటూ ప్రకటించింది ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్. వివరాల్లోకి వెళ్తే..
ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వేగా హెల్మెట్‌లతో కలిసి రోడ్డు భద్రతపై అవగాహన పెంచడానికి సరికొత్త పథకంతో ముందుకొచ్చింది. వాహనదారులలో రక్షణ అలవాటును పెంపొందించడానికి వేగా హెల్మెట్ ప్రతి ఆన్‌లైన్ కొనుగోలుపై వ్యక్తిగత ప్రమాద పాలసీని అందించడానికి సహకరించింది. టూవీలర్ వాహనదారులవ్యక్తిగత ప్రమాద బీమా పాలసీగా రూ.లక్ష వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని ప్రకటించింది. హెల్మెట్ కొన్నవారికి బీమా సౌకర్యం కల్పించడం దేశంలో ఇదే మొదటిసారి.
YouGov ఇంటర్నేషనల్ ఆటోమోటివ్ రిపోర్ట్ 2021 ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను భారతీయులు మాత్రమే అతి తక్కువగా ఉపయోగిస్తారని వెల్లండింది. భారతీయుల్లో దాదాపు 49% మంది సొంత వాహనాల్లోనే ప్రయాణించడానికి ఆసక్తిని చూపిస్తున్నారని తెలిపింది. పురుషులతో సమానంగా మహిళలు కూడా ఇప్పుడు ద్విచక్రవాహనంపై ప్రయాణించడానికి ఎక్కువమందికి ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో రోజు రోజుకీ మోటార్ బైక్స్ వాడకం కూడా పెరిగింది. మరోవైపు ప్రమాదాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. దీంతో వాహనాల ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించింది. వాహనదారులు పాటించేలా చర్యలు చేపట్టింది. ఇపుడు బండి నడిపేవారు మాత్రమే కాదు.. వెనుక కూర్చుని ప్రయాణిస్తున్నవారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలనే రూల్ పెట్టింది. వెనుక కూర్చున్నవారికి 4 ఏళ్ళు దాటితే తప్పకుండా హెల్మెట్ ధరించాలని రూల్. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వేగా హెల్మెట్ చేతులు కలిపి భాగస్వామ్యం అయ్యాయి.
Also Read: పక్షవాతానికి గురైన అనాథ గున్న ఏనుగు కథ చాలా స్ఫూర్తిదాయకం.. వీడియో వైరల్..