AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Woman in Room 10 Years: పదేళ్లుగా ప్రియురాలిని దాచిన ప్రియుడు.. తనకే సమస్యా లేదంటున్న యువతి.. అసలు కథ ఇదీ..

Woman in Room 10 Years: పదేళ్లుగా తన ప్రేమికుడి గదిలోంచి బయటకు రాకుండా దాక్కున్న మహిళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి కేరళ రాష్ట్ర...

Woman in Room 10 Years: పదేళ్లుగా ప్రియురాలిని దాచిన ప్రియుడు.. తనకే సమస్యా లేదంటున్న యువతి.. అసలు కథ ఇదీ..
Lovers
Shiva Prajapati
|

Updated on: Jun 15, 2021 | 7:18 PM

Share

Woman in Room 10 Years: పదేళ్లుగా తన ప్రేమికుడి గదిలోంచి బయటకు రాకుండా దాక్కున్న మహిళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి కేరళ రాష్ట్ర మహిళా కమిషన్ మంగళవారం పాలక్కాడ్ జిల్లా నెన్మారా చేరుకుంది. యుక్తవయసులో తన ఇంటి నుండి తప్పిపోయిన సజిత, అప్పటి నుండి వారి కుటుంబ సభ్యులకు తెలియకుండా తన ప్రేమికుడు రెహ్మాన్‌తో జీవనం సాగిస్తోంది. తాజాగా ఈ వ్యవహారం బయటపడటంతో.. మహిళా కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రెహ్మాన్ ఇంటికి వచ్చిన మహాళా కమిషన్ హెడ్ ఎంసీ జోసెఫిన్, ఇతర అధికారులు సజిత స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. కాగా, తమకు ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు సహాయం చేయాలని మహిళా కమిషన్‌ను సజిత్ అభ్యర్థించింది.

‘‘నేను గత 10 సంవత్సరాలుగా రెహ్మాన్ ఇంట్లోనే ఉన్నాను. నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు.’’ అని మహిళా కమిషన్‌కు సజిత స్పష్టం చేసింది. అయితే, అజ్ఞాతంలో ఒక దశాబ్దం పాటు ఉండటంపై నెలకొన్న సందేహాలను తొలగించడానికి గురువారం సజిత.. రెహ్మాన్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడాల్సి ఉంది. అయితే, సజిత తన తల్లిదండ్రులకు భయపడి రెహ్మాన్ ఇంట్లోనే ఆశ్రయం పొందుతోంది.

ఇదిలాఉంటే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి, 2010లో నెన్మారా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐరూర్ సమీపంలో ఓ గ్రామానికి చెందిన సజిత.. తన ఇంటి నుంచి పారిపోయింది. అప్పటి నుంచి సజిత కోసం ఆమె తల్లిదండ్రులు వెతుకుతూనే ఉన్నారు. అయితే, సజిత తాను ప్రేమిస్తున్న రెహ్మాన్‌తో కలిసి అతని ఇంట్లోనే పదేళ్లుగా ఎవరికీ తెలియకుండా, కనీసం ఇంట్లో చిన్న అలికిడి కూడా రాకుండా ఉంటోంది. తాజాగా కరక్కట్టుపరంబ్‌లోని రెహ్మాన్‌ ఇంట్లో పదేళ్లు ప్రశాంతంగా ఉన్నారు. అయితే మూడు నెలల క్రితం రెహ్మాన్ తప్పిపోయాడంటూ సజిత బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగు చూసింది. అలా ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కోర్టులో హాజరుపరిచారు. రెహ్మాన్, సజిత్ ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలిపారు. దాంతో కోర్టు సైతం వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Also read:

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా జట్టు ఇదే.. ఆ ప్లేయర్‌కు మరోసారి నిరాశ.. కోహ్లీపై చురకలు.!