AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టెన్షన్‌.. టెన్షన్‌.. సీఎం ఆఫీస్‌తో పాటు ఇంటికి బాంబు బెదిరింపు!

ముఖ్యమంత్రి కార్యాలయం, నివాసానికి బాంబు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో తిరువనంతపురం నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. సచివాలయం, ఇతర ప్రభుత్వ భవనాలకు కూడా బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్ ద్వారా వచ్చిన బెదిరింపులను తీవ్రంగా పరిగణిస్తూ, పోలీసులు విస్తృతంగా శోధనలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీ మే 2న కేరళ పర్యటన నేపథ్యంలో ఈ ఘటనలు మరిన్ని ఆందోళనలను రేపుతున్నాయి.

టెన్షన్‌.. టెన్షన్‌.. సీఎం ఆఫీస్‌తో పాటు ఇంటికి బాంబు బెదిరింపు!
Bomb Threats
SN Pasha
|

Updated on: Apr 28, 2025 | 1:56 PM

Share

ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఆయన ఇంటికి బాంబు బెదిరింపు రావడంతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఒక్కసారిగా అప్రమత్తమైంది. కేరళ సీఎం పినరయి విజయన్ అధికారిక నివాసం అయిన క్లిఫ్ హౌస్, సచివాలయంతో సహా అనేక హై-సెక్యూరిటీ ప్రభుత్వ కార్యాలయాలకు బాంబు బెదిరింపులు రావడంతో కేరళ రాజధానిలో హై అలర్ట్‌ ప్రకటించారు. ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో బాంబు స్క్వౌడ్‌ను వెంటనే మోహరించి, భద్రతా తనిఖీలను ముమ్మరం చేపట్టారు భద్రతా సిబ్బంది.

ప్రస్తుతం ప్రభావితమైన అన్ని ప్రదేశాలలో ప్రస్తుతం సెర్చ్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకైతే ఎలాంటి బాంబ్‌ను కూడా స్క్వౌడ్‌ కనిపెట్టలేదు. ఇది అసత్య బెదిరింపుగా కూడా అధికారులు అనుమానిస్తున్నారు. కానీ, ఆ బెదిరింపులను తేలిగ్గా తీసుకోవడం లేదు. ఈ మధ్య కాలంలో ఇలాంటి బెదిరింపులు రావడం సర్వసాధరణంగా మారిపోయింది. ఆదివారం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది, విస్తృత భద్రతా తనిఖీల తర్వాత అబద్ధమని తేలింది.

అలాగే హిల్టన్ గార్డెన్ ఇన్, గోకులం గ్రాండ్ హోటల్‌తో సహా నగరంలోని అనేక హోటళ్లకు శనివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. అది కూడా ఫేక్‌ అని తేలింది. సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగించి, ప్రజల ఆందోళనను పెంచిన ఈ బెదిరింపులకు ఎవరు పాల్పడ్డారని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న కేరళలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ బెదిరింపులను కేరళ పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి