Kerala Smart Kitchen Scheme: మహిళలకు సబ్సిడీపై వాషింగ్ మెషీన్లు, స్మార్ట్ కిచెన్ వస్తువులు.. కేరళ సర్కార్ కీలక నిర్ణయం
కిచెన్‌లో మహిళల కష్టాలకు చెక్ పెట్టే స్కీమ్‌ను తీసుకొచ్చింది కేరళ ప్రభుత్వం. వంటింట్లో పని భారం తగ్గించేందుకు స్మార్ట్ కిచెన్ పథకాన్ని ప్రారంభించారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.
Kerala Smart Kitchen scheme: కిచెన్‌లో మహిళల కష్టాలకు చెక్ పెట్టే స్కీమ్‌ను తీసుకొచ్చింది కేరళ ప్రభుత్వం. వంటింట్లో పని భారం తగ్గించేందుకు స్మార్ట్ కిచెన్ పథకాన్ని ప్రారంభించారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. ఈ స్కీమ్ కింద మహిళలు వాషింగ్ మెషీన్లు, గ్రైండర్లు, రెఫ్రిజిరేటర్, డిష్ వాషర్, మైక్రో ఓవెన్లను సబ్సిడీ ద్వారా అందించనుంది. ఈ వస్తువుల్ని ప్రభుత్వమే ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లింపు కింద అందిస్తుంది. ఒక్కో పరికరం విలువలో మూడొంతులు మహిళలు చెల్లిస్తే చాలు.. ప్రభుత్వం మిగతా సొమ్ము చెల్లిస్తుందని సీఎం విజయన్ తెలిపారు.
స్మార్ట్ కిచెన్ పథకాన్ని అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం పినయి విజయన్ ప్రకటించారు. ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలి కేబినెట్ సమావేశంలోనే స్మార్ట్ కిచెన్ స్కీమ్ అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ స్కీమ్ అమలు కోసం ముగ్గురు సెక్రటరీ స్థాయి అధికారులతో కమిటీని వేసినట్లు సీఎం విజయన్ ట్వీట్ చేశారు. స్కీమ్ అమలుకు విది విధానాలను రూపొందించి జులై 10 నుంచి పథకాన్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.
కచాలా కుటుంబాల్లో మహిళలు రోజులో ఎక్కువ సమయం వంటింట్లోనే గడిపేస్తుంటారు. కేరళ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం వల్ల సమయం మిగలడంతో పాటు.. పని భారం కూడా తగ్గుతుంది. కేరళలో ఈ స్కీమ్ విజయవంతం అయితే మిగతా రాష్ట్రాల్లోనూ ప్రవేశ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also…. Sonu Sood: యాంకర్ వింధ్యా విశాఖను ప్రశంసించిన సోనూసూద్.. ఎందుకో తెలుసా..?