Viral: యూట్యూబ్‌లో చూసి మద్యం తయారు చేసిన 12 ఏళ్ల బాలుడు.. ఆపై దాన్ని ఫ్రెండ్‌తో తాగించగా
ఈ బాలుడు పిల్లోడు కాదు పిడుగు. లేకపోతే ఏంటండీ.. 12 ఏళ్ల వయసులోనే యూట్యూబ్‌లో చూసి కల్తీ మద్యం తయారుచేశాడు. అంతటితో ఊరుకోలేదు.
Kerala: టెక్నాలజీ అప్‌డేట్ అవ్వడం మంచిదే. కానీ దాన్ని ఎలా వినియోగిస్తున్నామనదే ముఖ్యం. ఇప్పుడు జరిగే చాలా క్రైమ్స్‌లో సోషల్ మీడియా కీ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. యూట్యూబ్‌లో చూసి ఇళ్లకు కన్నాలెయ్యడం.. కొత్త కొత్త క్రైమ్స్‌కు పాల్పడటం వంటివి చూశాం. తాజాగా అదే క్రమంలో ఓ 12 ఏళ్ల బుడతడు ఊహించని పని చేశాడు. యూట్యూబ్‌లో చూసి ఏకంగా లిక్కర్ తయారుచేశాడు. అందుకు ద్రాక్ష పళ్లను వినియోగించాడు. అయితే తయారు చేసినవాడు తాను తాగకుండా.. ఫ్రెండ్‌తో తాపించాడు. అది తాగిన కుర్రాడు వెంటనే అస్వస్థతకు లోనయ్యాడు. వాంతులు, విరేచనాలతో హాస్పిటల్‌లో చేరాడు. కేరళ తిరువనంతపురం(Thiruvananthapuram)లోని చిరాయింకీజు(Chirayinkeezhu)లో గత శుక్రవారం ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ కల్తీ లిక్కర్ తాగిన బాలుడి ఆరోగ్య పరిస్థితి ప్రజంట్ బానే ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం బాలుడు తయారు చేసిన లిక్కర్‌ను కోర్టు పర్మిషన్ తీస్కోని.. టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపారు. ఆ బాలుడు తయారు చేసిన మద్యంలో ఇంకేదైనా ఆల్కాహాల్ లేదా రసాయనాలు మిక్స్ చేసినట్లైతే కేసు ఫైల్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఆ కల్తీ మద్యం తయారుచేసిన బాలుడు మాత్రం.. ఇంట్లో తన పేరెంట్స్ తినేందుకు తెచ్చిన ద్రాక్ష పళ్లతోనే తయారుచేసినట్లు చెబుతున్నాడు. అందులో ఎటువంటి రసాయనాలు మిక్స్ చేయలేదని వెల్లడించాడు. యూట్యూబ్ వీడియోలో చూసి తయారుచేశానని… ఆ తర్వాత కొన్ని గంటలు పాటు గుంత తీసి పాతి పెట్టినట్లు వెల్లడించాడు. ఆ తర్వాత ఫ్రెండ్‌తో తాపించినట్లు వివరించాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..