Karnataka New CM: ఈయన కర్నాటక సీఎం.. ఆయన డిప్యూటీ సీఎం.. మరికాసేపట్లో ఉత్కంఠకు ఎండ్ కార్డ్..
నాలుగు రోజుల మేధోమథనం తర్వాత కర్ణాటక సీఎం పేరును కాంగ్రెస్ ఖరారు చేసింది. సిద్ధరామయ్యపై ఆ పార్టీ మరోసారి విశ్వాసం పెంచుకుంది. ఆయన పేరును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

కర్నాటక సీఎంగా సిద్దరామయ్య పేరు దాదాపుగా ఖరారైంది. సీనియార్టీ దృష్ట్యా సిద్దరామయ్య వైపే అధిష్టానం మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. మరికాసేపట్లో ఆయన పేరును ఖర్గే ప్రకటించనున్నారు. మరోవైపు సిద్దరామయ్యతో రాహుల్ భేటీ కొనసాగుతోంది. ఇక మధ్యాహ్నం డీకేతో భేటీలోనూ రాహుల్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తారని తెలుస్తోంది. నాలుగు రోజుల మేధోమథనం తర్వాత కర్ణాటక సీఎం పేరును కాంగ్రెస్ ఖరారు చేసింది. సిద్ధరామయ్యపై ఆ పార్టీ మరోసారి విశ్వాసం పెంచుకుంది. ఆయన పేరును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కర్ణాటక సీఎం రేసులో సిద్ధరామయ్య తన ప్రత్యర్థి డీకే శివకుమార్‌పై విజయం సాధించారు. రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేయవచ్చు. అదే సమయంలో డీకే శివకుమార్ ప్రభుత్వంలో చేరడంపై సస్పెన్స్ కొనసాగుతోంది.
కర్ణాటకలో సీఎం రేసులో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య హోరాహోరీ పోరు సాగినా సిద్ధరామయ్య విజయం సాధించారు. అయితే, అది అంత సులభం కాదు. వీరిద్దరి మధ్య సీఎం ఎంపిక విషయంలో కాంగ్రెస్‌లో గందరగోళం ఎలా ఏర్పడిందో.. కాంగ్రెస్ పేరు ఖరారు చేయడానికి నాలుగు రోజులు పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు.
సీఎం అభ్యర్థిగా తననే ప్రకటించాలని డీకే చాలా ప్రయత్నాలు చేశారు. ఇందులోభాగంగా సిద్దరామయ్య తప్పుల జాబితాను ఖర్గేకు అందించారు. అయినప్పటికీ ఆ రిపోర్ట్‌ను హైకమాండ్ పెద్దగా పట్టించుకోలేదు. గతంలో సీఎంగా సిద్దరామయ్య క్లీన్ ఇమేజ్ పార్టీకి కలిసొస్తుందని భావించింది. అలాగే ఆయన అనుభవం కలిసొస్తుందని లెక్కలేసుకుంది. మరోవైపు డికేకు ఈడీ, సీబీఐ కేసులు అడ్డంకిగా మారినట్టు స్పష్టమవుతోంది.
మరిన్ని జాతీయవార్తల కోసం




