ఏకంగా మంత్రినే హనీట్రాప్‌లో ఇరికించే ప్రయత్నం.. అసెంబ్లీ సాక్షిగా వెల్లడి..!
ఫిర్యాదు దాఖలు చేసి, ఈ విషయంపై దర్యాప్తు జరపాలని మంత్రి సతీష్ అన్నారు. "మేము ఫిర్యాదు చేసి విచారణ నిర్వహించాలని డిమాండ్ చేసాం.. బాధితురాలు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరామన్నారు. అప్పుడే దానిపై దర్యాప్తు జరుగుతుంది. నిజం బయటకు వస్తుంది" అని ఆయన అన్నారు.

ఇటీవల కాలంలో హానీట్రాప్ కేసులు పెరుగుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని, ముగ్గులోకి దింపి.. వీడియోలు, ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేస్తుంటారు. అమాయకులే కాదు.. అమాత్యులకు వరకు చిక్కుకుంటున్నారు. తాజాగా ఈ మాయ వలలో కర్ణాటక మంత్రి ఒకరిని ఇరికించేందుకు ప్రయత్నించింది ఓ మయాలేడీ.
కర్ణాటకలో ప్రముఖ మంత్రిని హనీట్రాప్ చేయడానికి ప్రయత్నం జరిగింది. ఈ అంశాన్ని శాసనసభలోనూ ప్రస్తావించారు. కర్ణాటక మంత్రి సతీష్ జార్కిహోళి గురువారం(మార్చి 20) ఒక రాష్ట్ర మంత్రిపై జరిగిన హనీట్రాప్ ప్రయత్నాన్ని ధృవీకరించారు. ఆ ప్రయత్నం జరిగిందని, కానీ అది విఫలమైందని అన్నారు. “దీనికి ప్రయత్నించిన మాట నిజమే, కానీ అది విజయవంతం కాలేదు. కర్ణాటకలో ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు; గత 20 సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉంది. కాంగ్రెస్, బీజేపీ, జెడిఎస్, ప్రతి పార్టీ దీనికి బాధితులే” అని జార్కిహోళి అసెంబ్లీ అన్నారు.
ప్రముఖ మంత్రులను రెండుసార్లు హనీట్రాప్ చేశారని, వారి ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరిగాయని మంత్రి సతీష్ జార్కిహోళి అన్నారు. హనీట్రాప్ వెనుక ఎవరో ఉన్నారని ఆయన ఆరోపించారు. మంత్రిపై హనీట్రాప్ ప్రయత్నం జరిగిందని ఆయన ధృవీకరించారు. మంత్రి ఫిర్యాదు చేసినప్పుడే అది అధికారికమవుతుందని ఆయన అన్నారు. హనీట్రాప్ ఎవరు చేస్తున్నారో విచారణ జరగాలన్నారు. ప్రజలను హనీట్రాప్‌లో బంధించడానికి ఒక బృందం పనిచేస్తోంది. ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణించాలి. ఇది అన్ని పార్టీలు చర్చించాల్సిన అంశం అని ఆయన అన్నారు. శాంతిభద్రతలపై చర్చ సందర్భంగా ఈ అంశాన్ని లేవనెత్తిన బీజేపీ సభ్యుడు సునీల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రత్యర్థులను ఈ విధంగా అణచివేస్తున్నారని మండిపడ్డారు
ఫిర్యాదు దాఖలు చేసి, ఈ విషయంపై దర్యాప్తు జరపాలని మంత్రి సతీష్ అన్నారు. “మేము ఫిర్యాదు చేసి దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేసాం.. బాధితురాలు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరామన్నారు. అప్పుడే దానిపై దర్యాప్తు జరుగుతుంది. నిజం బయటకు వస్తుంది” అని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా, కర్ణాటక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే బి.వై. విజయేంద్ర గురువారం వక్ఫ్ (సవరణ) బిల్లుకు వ్యతిరేకంగా కర్ణాటక అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని విమర్శించారు. దీనిని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం బలవంతంగా ఆమోదించిందని ఆయన ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల నిరసనల మధ్య కర్ణాటక ప్రభుత్వం బుధవారం కేంద్రం ప్రతిపాదిత చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించింది. “కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌లో చేసిన సవరణను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక బిల్లును బలవంతంగా ఆమోదించారు. మోదీ సర్కార్ వక్ఫ్‌లో పారదర్శకత తీసుకురావాలని ఆసక్తి చూపుతున్నప్పుడు, సిద్ధరామయ్య ప్రభుత్వం భూ కబ్జాదారులను రక్షించాలని కోరుకుంటోంది” అని విజయేంద్ర ఆరోపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..