నైట్ కర్ఫ్యూ ఆదేశాలను ఉపసంహరించుకున్న కర్ణాటక ప్రభుత్వం… ఒక్క రోజులోనే యూటర్న్
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్న..
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది అక్కడి ప్రభుత్వం. కర్ఫ్యూ కి సంబంధించిన ఆదేశాలను గురువారం ఉపసంహరించుకుంది ప్రభుత్వం. ప్రతి రోజూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ ఉంటుందని బుధవారం ఆదేశాలను జారీ చేసింది. అయితే పరిస్థితిని సమీక్షించిన తర్వాత టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సూచన మేరకు రాత్రి పూట కర్ఫ్యూ ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లు సీఎం కార్యాలయం ప్రకటించింది.