gold seized in india: గత అయిదేళ్ళలో కస్టమ్స్ సీజ్ చేసిన బంగారమెంతో తెలిస్తే షాకే..
భారత్‌లో రోజురోజుకి బంగారానికి క్రేజ్ పెరిగిపోతునే ఉంది. దీంతో విదేశాల నుంచి గోల్డ్ స్మగ్లర్లు అక్రమంగా పసిడి దిగుమతులు చేస్తున్నారు. ఇందుకోసం ఎయిర్ పోర్టులను
భారత్‌లో రోజురోజుకి బంగారానికి క్రేజ్ పెరిగిపోతునే ఉంది. దీంతో విదేశాల నుంచి గోల్డ్ స్మగ్లర్లు అక్రమంగా పసిడి దిగుమతులు చేస్తున్నారు. ఇందుకోసం ఎయిర్ పోర్టులను పక్కా అడ్డగా మార్చుకుంటున్నారు. రోజులో ఒక్కసారైన అక్రమ బంగారం దిగుమతి ఎక్కడో ఒక ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకుంటున్నారు. అటు కొంత మంది లిక్విడ్ రూపంలో పసిడిని తరలిస్తుండగా.. మరికొంత మంది దుస్తులలో, షూలలో బంగారాన్ని తరలిస్తున్నారు. 2020 సెప్టెంబర్‌లో లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం గత ఐదేళ్ళలో అంటే 2015 నుంచి 2020 ఆగస్ట్ వరకు దేశంలోని వివిధ ఎయిర్‌పోర్టుల్లో11,000 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన బంగారం విలువ దాదాపు రూ.3,122 కోట్లు ఉంటుంది. ఇందులో గోల్డ్ స్మగ్లింగ్ కేసులు మొత్తం 16,555 నమోదయ్యాయి. అటు బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వారు దాదాపు 8,401 మందిని అరెస్టు్ చేశారు.
కాగా దేశంలో గత ఐదేళ్ళలో వివిధ ఎయిర్‌పోర్టులలో అరెస్ట్ చేసిన వివరాలను చూసుకుంటే.. 2015-16లో దాదాపు 1,408 మంది, 2016-17లో 788 మందిని, 2017-18లో 1,525 మందిని, 2018-19లో 2,141 మందిని అరెస్ట్ చేశారు. కాగా ఇప్పటి దాకా అంటే 2020-2021 సంవత్సరంలో దాదాపు 2000 మంది కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక దేశంలో ఇప్పటి వరకు బంగారం ఎక్కువగా దొరికిన టాప్ టెన్ ఎయిర్‌పోర్టులలో ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత కేరళలోని అన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు రెండవ స్థానాలలో ఉన్నాయి. అటు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో కూడా అక్రమంగా బంగారాన్ని భారీగానే పట్టుకున్నారు. బెంగుళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఆరవ స్థానంలో ఉండగా.. తెలంగాణ హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు 9వ స్థానంలో ఉంది.
గత ఐదేళ్ళలో బంగారం ఎక్కువగా దొరికిన ఎయిర్‌పోర్టులలో తమిళనాడులోని చెన్నై ఎయిర్‌పోర్టు మూడవ స్థానంలో ఉంది. ఇక్కడి ఎయిర్‌పోర్టులో ఎక్కువగానే అక్రమ బంగారం దిగుమతులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్న సంఘటనలున్నాయి. పూర్తి వివరాలను చూసుకుంటే.. 2015 జూలై 5న దోహా నుంచి చెన్నై వచ్చిన సిరాజ్ నుంచి 3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 2016 ఫిబ్రవరి 12న మలేసియా నుంచి డిటర్జెంట్ పౌడర్ ప్యాకెట్లలో పెట్టి తెచ్చిన 12 కేజీల బంగారం బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకోగా.. అదే ఏడాది మే 26వ తేదీన దుబాయ్ నుంచి వచ్చి మరుగుదొడ్డిలో 1 కేజీ బంగారం దాచిన వ్యక్తి అరెస్ట్ చేశారు కస్టమ్స్ అధికారులు. ఇక 2019 నూతన సంవత్సరం మొదటి రోజున చెన్నై ఎయిర్ పోర్టులో రూ.8 కోట్ల విలువైనం 24 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. అదే సంవత్సరం జనవరి 12న దక్షిణ కొరియాకు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి దాదాపు 24 కిలోల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. ఫిబ్రవరి 22న యూఎస్‌బీ చిప్స్, స్మార్ట్ వాచ్‌లు, కెమెరా లెన్స్‌ల మాటున తెచ్చిన 25 కేజీల బంగారం అధికారులు సీజ్ చేశారు. అంతేకాకుండా అక్టోబర్ 6వ తేదీన మలేషియా నుంచి చెన్నైకి వచ్చిన ఇద్దరు వ్యక్తుల నుండి 620 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకోగా.. అదే ఏడాది నవంబర్ 10న దుబాయ్ నుంచి మాస్క్ల్లో తరలిస్తున్న 3.5 కిలోల గోల్డ్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మొత్తం 11 మంది అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.కోటీ 85 లక్షల విలువవైన బంగారాన్ని ప్యాంటు జేబులు, ఇతర ప్రైవేట్ భాగాల్లో దాచి ఉంచినట్లుగా అధికారులు గుర్తించారు. కాగా అదే సంవత్సరం నవంబర్ 11న చైన్నైలో రూ .71.5 లక్షల విలువైన 1.8 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని రబ్బరు రూపంలో వారి ప్యాంటు నడుము పట్టీలో దాచిన ముగ్గురిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. ఇక 2020లో జనవరి 3న చెన్నైలో ఓ ప్రయాణికుడి లగేజీలో 2 కేజీల బంగారం అధికారులు పట్టుకున్నారు. దీని విలువ దాదాపు రూ.86 లక్షలు. కాగా ఇదే సంవత్సరం ఫిబ్రవరి 26న చైన్నై ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణికుడి దగ్గరి నుంచి దాదాపు 1.4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అటు మార్చి 18న కూడా పార్సిల్ విభాగంలో తనిఖీలు చేస్తుండగా 4.6 కేజీల బంగారం దొరికింది. ఆగస్ట్ 5వ తేదీన షార్జా నుంచి వచ్చిన ఐదుగురు ప్రయాణికుల చెప్పులు, అండర్ వేర్‌లో దాచిపెట్టిన దాదాపు 1.48 కిలోల బంగారంను అధికారులు పట్టుకున్నారు. అదే రోజు చెన్నై విమానాశ్రయంలో రూ.82.3 లక్షల విలువైన సుమారు 1.48 కిలోల బంగారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మళ్ళీ అదే నెలలో 22వ తేదీన 74.4 లక్షల విలువైన బంగారాన్ని పట్టుకోగా.. సెప్టెంబర్ 27న చెన్నై విమానాశ్రయంలో దుబాయి నుంచి చెన్నైకు అక్రమంగా 1.62 కేజీల బంగారాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇక డిసెంబర్ 6న తేదీన వైద్య పట్టీ వెనుక గోల్డ్ పేస్ట్ ఉన్న కవర్లు, 147 గ్రాములున్న బంగారాన్ని అధికారులు గుర్తించారు. దీని విలువ దాదాపు రూ.7.5 లక్షలు ఉంటుంది. అదే రోజున మరో ఇద్దరు ప్రయాణీకుల నుంచి రూ.7.2 లక్షల విలువైన 142 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అంతే కాకుండా ఇదే ఏడాది నవంబర్ నెలలో చెన్నై ఎయిర్ పోర్టులో దుబాయి నుంచి వస్తున్న ఇద్దరు ప్రయాణికుల నుంచి 4 కేజీల గోల్డ్‌ను పట్టుకున్నారు. దీని విలువ దాదుపు 2.06 కోట్లు. ఈ ఏడాది డిసెంబర్ 7న దుబాయ్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడు తన శరీరంపై గాయాలకు కట్టిన బ్యాండేజిల చాటున 265 గ్రాముల బంగారాన్ని అధికారులు గుర్తించారు. అటు ఈనెల 14న ఇదే ఎయిర్ పోర్టులో దుబాయ్ నుంచి వస్తున్న ఏడుగురు వ్యక్తుల నుంచి 1.10 కిలోల గోల్డ్ చైన్స్, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ ప్లేట్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.