రైతుసంఘాలను చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్రం మరో లేఖ.. నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తే సిద్ధమంటున్న అన్నదాతలు

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ.. అన్నదాతలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

రైతుసంఘాలను చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్రం మరో లేఖ.. నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తే సిద్ధమంటున్న అన్నదాతలు
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 24, 2020 | 5:46 PM

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ.. అన్నదాతలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఇప్పటికే పలుసార్లు రైతుసంఘాలతో ప్రభుత్వం చర్చించిన ఆ చర్చలు విఫలమయ్యాయి. తాజాగా మరో సరి చర్చలకు రెడీ అయ్యింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌ రైతు సంఘాల నేతలకు గురువారం లేఖ రాశారు. రైతులకు సమస్యకు పరిష్కారం చూపేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని, గతంలో సవరణలు చేస్తామంటూ ఇచ్చిన ప్రతిపాదనలను అప్పుడే తిరస్కరించామన్నారు అన్నదాతలు. ఉద్యమంతో సంబంధంలేని సంఘాలతో కేంద్రం మాట్లాడుతోందని.. అలా చేయడం వల్ల తమ ఉద్యమాన్ని బలహీనం చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తే చర్చలకు సిద్ధమేనంటూ రైతులు స్పష్టంచేసిన నేపథ్యంలో తాజాగా కేంద్రం రైతులను చర్చలకు ఆహ్వానిస్తూ లేఖ రాసింది.