AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: సీబీఐకి కాంగ్రెస్ సర్కార్ రెడ్ సిగ్నల్‌.. రాష్ట్రంలోకి రాకుండా నో ఎంట్రీ బోర్డ్‌!

సీబీఐకి కర్ణాటక ప్రభుత్వం రెడ్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రంలోకి నో ఎంట్రీ బోర్డ్‌ పెట్టేసింది. సడెన్‌గా ఎందుకీ డెసిషన్‌...? రాష్ట్రంలోని కేసుల దర్యాప్తునకు సీబీఐకి ఇచ్చిన సాధారణ అనుమతిని ఉపసంహరించుకోవాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.

Karnataka: సీబీఐకి కాంగ్రెస్ సర్కార్ రెడ్ సిగ్నల్‌.. రాష్ట్రంలోకి రాకుండా నో ఎంట్రీ బోర్డ్‌!
Cm Siddaramaiah
Balaraju Goud
|

Updated on: Sep 26, 2024 | 9:05 PM

Share

సీబీఐకి కర్ణాటక ప్రభుత్వం రెడ్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రంలోకి నో ఎంట్రీ బోర్డ్‌ పెట్టేసింది. సడెన్‌గా ఎందుకీ డెసిషన్‌…? రాష్ట్రంలోని కేసుల దర్యాప్తునకు సీబీఐకి ఇచ్చిన సాధారణ అనుమతిని ఉపసంహరించుకోవాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ స్థల కేటాయింపు కేసులో సిద్ధరామయ్యపై ప్రత్యేక కోర్టు లోకాయుక్త పోలీసుల విచారణకు ఆదేశించిన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామం జరిగింది. ఇదంతా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముడా స్కాం ఎఫెక్టేనా..? అన్న చర్చ మొదలైంది.

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ స్కాం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ముఖ్యమంత్రి తన సొంతవాళ్లకు ఇష్టం వచ్చినట్లు స్థలాలు కేటాయిచారంటూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ముడా కేసును సీబీఐకి అప్పగించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక భూభూగంలోకి ఎంటరవ్వొద్దంటూ సీబీఐకి రెడ్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రంలో కేసుల విచారణకు సంబంధించి సీబీఐ అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని కర్ణాటక న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ స్పష్టం చేశారు. సీబీఐని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందనే ఆందోళనలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్రంలో సీబీఐ విచారణకు బహిరంగ సమ్మతిని ఉపసంహరించుకుంటున్నామని న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌ తెలిపారు. సీబీఐ దుర్వినియోగంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సీబీఐకి రిఫర్ చేసిన అన్ని కేసులలో ఇప్పటివరకు ఛార్జిషీట్లు దాఖలు చేయలేదని, చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని మండిపడ్డారు. తాము పంపిన అనేక కేసులను దర్యాప్తు చేయడానికి సీబీఐ నిరాకరించిందని, ఇలాంటి ఉదంతాలు చాలానే ఉన్నాయన్నారు. సీబీఐ పక్షపాతంతో ఉన్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మంత్రి హెచ్‌కే పాటిల్ తెలిపారు. ఇది ముడా కేసుతో సంబంధం లేదని, సీబీఐ తప్పుదారి పట్టకుండా నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి హెచ్‌కే పాటిల్‌ స్పష్టం చేశారు.

సీబీఐ అనుమతి రద్దుకు ముడా స్కాంకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు కర్ణాటక ప్రభుత్వ పెద్దలు. సీబీఐ పక్షపాత వైఖరితో పనిచేస్తున్నందునే.. ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. బీజేపీ ఏం చెబితే సీబీఐ అదే చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. మరో కీలక నిర్ణయానికి కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. తమ అనుమతి లేకుండా గవర్నర్ అడిగిన సమాచారాన్ని అందించకూడదని రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం