కర్ణాటకలో అప్పుడే బీజేపీ నేతల అసంతృప్తి.. కేబినెట్ లో చోటు దక్కలేదని ఆవేదన.. కొత్త సీఎం బొమ్మైకి తలనొప్పి

కర్ణాటకలో కొత్త సీఎం బసవరాజ్ బొమ్మై తన నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు., నిన్న 29 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కేబినెట్ లో చోటు దక్కనివారు తమ నిరసన గళాన్ని వినిపించడం ప్రారంభించారు.

కర్ణాటకలో అప్పుడే బీజేపీ నేతల అసంతృప్తి.. కేబినెట్ లో చోటు దక్కలేదని ఆవేదన.. కొత్త సీఎం బొమ్మైకి తలనొప్పి
Karnataka Cm Basavaraj Bommai Dissent In Karnataka Bjp Leaders
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Aug 05, 2021 | 10:05 AM

కర్ణాటకలో కొత్త సీఎం బసవరాజ్ బొమ్మై తన నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు., నిన్న 29 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కేబినెట్ లో చోటు దక్కనివారు తమ నిరసన గళాన్ని వినిపించడం ప్రారంభించారు. మాజీ సీఎం యెడియూరప్ప ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారు. ఇతర సీనియర్ బీజేపీ నేతలు కూడా బాహాటంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. కొత్త కేబినెట్ లో 13 జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. మైసూరు, కల్ బుర్గి, కొడగు, రాయచూర్, బళ్లారి, దావన గెరె తదితర జిల్లాల నేతలను బొమ్మై తన కేబినెట్ లోకి తీసుకోలేదు. మాజీ మంత్రులు జగదీశ్ షెట్టర్, లక్షణ్ సావడి, సి.పీ. యోగేశ్వర్ వంటి వారు తమ సహచరులతో సహా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాను మూడుసార్లు ఎన్నికై. పార్టీకి అత్యంత విధేయుడినైనా తనను మంత్రిగా తీసుకోలేదని ఎస్సీ సామాజికవర్గానికి చెందిన హాలేరు ఎమ్మెల్యే నెహరు ఒలేకర్ బాధ పడుతున్నారు. ఈయన మద్దతుదారులు కూడా ధర్నాకు పూనుకొన్నారు. ఏ ప్రాతిపదికపై బొమ్మై తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారని ఈయన ప్రశ్నిస్తున్నారు.

అరవింద్ బెల్లాడ్, శ్రీమంత్ పాటిల్ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆనంద్ మామానీ తదితరులు..తాము ఢిల్లీకి వెళ్లి బీజేపీ అధిష్టానాన్ని సంప్రదించి వచ్చినా ఫలితం లేకపోయిందని అంటున్నారు. ఇన్నేళ్ళుగా పార్టీని అంటిపెట్టుకున్న తమకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు. ముఖ్యంగా మాజీ సీఎం యెడియూరప్ప కుమారుడు విజయేంద్రను కూడా కేబినెట్ లోకి తీసుకోకపోవడం గమనార్హం. పూర్ణిమ అనే ఎమ్మెల్యే తనకు కనీసం మూడు నాలుగు జిల్లాల్లో పట్టు ఉందని ..తమ గొల్ల వర్గానికి ఈ కేబినెట్ లో చోటు లేకుండా పోయిందని పేర్కొన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి : News Watch : మధ్యవర్తిత్వానికి జగన్ ఎందుకు నో చెప్పారంటే ! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..( వీడియో )

 మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జిమ్‌ కష్టాలు మాములుగా లేవుగా..గనీ సినిమా అప్డేట్ తో ముందుకు..:Varun Tej workouts Video.

 పెళ్లికూతురు ఆ సమయంలోనూ పుషప్స్ కొట్టింది..! ఫిట్‌నెస్‌ విషయంలో కచ్చితంగా ఉన్న వధువు…:Viral Video.

 అరాచకం టీవీని ఇలా కూడా ఆన్‌ చేస్తారా..?రిమోట్ లేకుండా ఎలా ఆన్ చెయ్యాలో ఇక్కడ చూడండి..:TV Viral Video.