‘నేను చేసింది కరెక్టే..’క్యాబ్ డ్రైవర్ ని కొట్టిన లక్నో యువతి సమర్ధన..అతనికి తగిన శాస్తి జరిగిందని వ్యాఖ్య
లక్నోలో ఇటీవల నడిరోడ్డులో ఓ క్యాబ్ డ్రైవర్ ను కొట్టి రచ్చ చేసిన 28 ఏళ్ళ యువతి తాను చేసింది కరెక్టేనని సమర్థించుకుంది. క్రాసింగ్ లో రెడ్ లైట్ వద్ద తాను ఆగగానే ఆ డ్రైవర్ తన కారుతో తన వాహనాన్ని ఢీ కొట్టాడని, దాంతో తాను కోపం పట్టలేకపోయాయని
లక్నోలో ఇటీవల నడిరోడ్డులో ఓ క్యాబ్ డ్రైవర్ ను కొట్టి రచ్చ చేసిన 28 ఏళ్ళ యువతి తాను చేసింది కరెక్టేనని సమర్థించుకుంది. క్రాసింగ్ లో రెడ్ లైట్ వద్ద తాను ఆగగానే ఆ డ్రైవర్ తన కారుతో తన వాహనాన్ని ఢీ కొట్టాడని, దాంతో తాను కోపం పట్టలేకపోయాయని ప్రియదర్శిని అనే ఆమె వెల్లడించింది. అతడి ఫోన్ ని నేలకేసి కొట్టానని, అతనిపై చెయ్యి చేసుకున్నానని ఆమె పేర్కొంది. అక్కడున్న పోలీసులు, ఇతరులు మౌన ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారని..అలాంటప్పుడు ఒక ఆడపిల్ల తనను తాను రక్షించుకోవడం తప్పా అని ఆమె ప్రశ్నించింది. గత ఏడాదికాలంగా ఆ డ్రైవర్ తనను వేధిస్తున్నాడని, తను పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆమె వాపోయింది. పైగా తన పైనే కేసు పెట్టారని వ్యాఖ్యానించింది. నా మీద రాబరీ (దోపిడీ) కేసు పెట్టారు. నేను దోపిడీదారునా అని ఆమె ప్రశ్నించింది. ఆ క్యాబ్ డ్రైవర్ కి తగినశాస్తి జరిగిందని, అతనికి నేను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ప్రియదర్శిని తెలిపింది.
అయినా ఆ ఆవసరమే లేదు.. ఆ ఘటనకు నేనేమీ చింతించడం లేదు అని పేర్కొంది. కాగా సీసీటీవీ ఫుటేజీలో ఆ క్యాబ్ డ్రైవర్ ఆమె వాహనాన్ని ఢీ కొట్టలేదని, రెడ్ సిగ్నల్ వద్దకు రాగానే తన వాహనాన్ని ఆపాడని , కానీ ఈ యువతే దాన్ని దాటి వచ్చి డ్రైవర్ మీద చెయ్యి చేసుకుందని తెలుస్తోంది. దీంతో పోలీసులు ఈ యువతిపై కేసు పెట్టారు. గత నెల 30 న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మరిన్ని ఇక్కడ చూడండి : News Watch : మధ్యవర్తిత్వానికి జగన్ ఎందుకు నో చెప్పారంటే ! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..( వీడియో )
పెళ్లికూతురు ఆ సమయంలోనూ పుషప్స్ కొట్టింది..! ఫిట్‌నెస్ విషయంలో కచ్చితంగా ఉన్న వధువు…:Viral Video.