Karnataka Polls: కాంగ్రెస్‌కు కలిసి వచ్చిన అంశాలు.. బీజేపీవి స్వయంకృతాపరాధాలు.. కన్నడ నాట ప్రభావం చూపినవి ఇవే

వచ్చే రోజులు కాంగ్రెస్ పార్టీవేనని ఆ పార్టీ నాయకులు ఒక కంక్లూజన్‌కి కూడా వచ్చేసారు. అయితే కర్ణాటకలో ప్రభావం చూపించిన అంశాలు వేరు.. జాతీయస్థాయిలో మరీ ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికలలో చర్చకు వచ్చే అంశాలు వేరు

Karnataka Polls: కాంగ్రెస్‌కు కలిసి వచ్చిన అంశాలు.. బీజేపీవి స్వయంకృతాపరాధాలు.. కన్నడ నాట ప్రభావం చూపినవి ఇవే
Rahul Gandhi - PM Modi
Follow us

|

Updated on: May 14, 2023 | 9:02 PM

కర్ణాటక విజయంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆనందోత్సాహాలకు పట్టపగ్గాలు లేవు. నిజమే.. గత దశాబ్ద కాలంగా ఆ పార్టీ చెప్పుకోదగిన విజయం సాధించిన సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయి. అందుకే కాబోలు కర్ణాటక విజయాన్ని ఆసేతు హిమాచలం కాంగ్రెస్ పార్టీ వర్గాలు పండగ చేసుకుంటున్నాయి. దేశంలో ఇంతకాలం కొనసాగిన నరేంద్ర మోదీ హవా ఇక కొనసాగబోదని, వచ్చే రోజులు కాంగ్రెస్ పార్టీవేనని ఆ పార్టీ నాయకులు ఒక కంక్లూజన్‌కి కూడా వచ్చేసారు. అయితే కర్ణాటకలో ప్రభావం చూపించిన అంశాలు వేరు.. జాతీయస్థాయిలో మరీ ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికలలో చర్చకు వచ్చే అంశాలు వేరు. ఈ విషయం పార్టీల అధినేతలకు తెలిసినదే అయినా ప్రజల మూడ్ మార్చేందుకు వారు ప్రస్తావించే అంశాలు వేరు. కొన్ని పార్టీలకు మద్దతుగా నిలిచే మీడియా సంస్థలు ప్రచురించే విశ్లేషణాత్మక కథనాలు వేరుగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో కలిసొచ్చిన అంశాలు చాలానే ఉన్నాయి. అదే సమయంలో కంగుతిన్న కమలనాధులకు నెగటివ్ అయినా అంశాలు కూడా ఎన్నో ఉన్నాయి. నెగటివ్ అంశాలను గుర్తించినందు వల్లే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ ఇతర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం చేయనంతగా కర్ణాటకలో ప్రచారం నిర్వహించారు. దాదాపు 30 బహిరంగ సభలలో మోదీ ప్రసంగించారు. ఆరు రోడ్డు షోలు నిర్వహించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోనే ఆయన మూడు రోడ్ షోలలో పాల్గొన్నారు. ఇది చూస్తేనే అర్థమవుతుంది మోదీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఏ స్థాయిలో ప్రాధాన్యమిచ్చారన్న విషయం. అయితే ఆయన శ్రమ వృధా అయ్యింది. దానికి కారణం ఆ పార్టీకి రాష్ట్రంలో సమిష్టి నాయకత్వం లేకపోవడమేనని ఇట్టే అర్థమవుతుంది.

కలిసి వచ్చిన రాహుల్ యాత్ర

ముందుగా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిన అంశాల గురించి చర్చించుకుంటే.. రాహుల్ గాంధీ కర్ణాటక రాష్ట్రంలో విస్తృతంగా జరిపిన భారత్ జోడోయాత్ర గురించే చెప్పుకోవాలి దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఆయన పాదయాత్ర కొనసాగిన ప్రాంతాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా రాహుల్ గాంధీ జరిపిన పాదయాత్ర కర్ణాటకలోని ఏడు జిల్లాల్లోని 20 నియోజకవర్గాల మీదుగా 2022 సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 23 మధ్య కొనసాగింది. ఈ 20 నియోజకవర్గాలలో 15 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇందులో బిజెపి, జెడిఎస్ కంచుకోటలు కూడా ఉన్నాయి. మైసూరు జిల్లాలో ఐదు, తుంకూర్ జిల్లాలో 4, మాండ్య, చిత్రదుర్గ జిల్లాల్లో 3 చొప్పున, బళ్లారి, రాయచూరు జిల్లాల్లో 2 చొప్పున, చామ రాజనగర జిల్లాలో ఒక నియోజకవర్గంలో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగింది. ఈ 20 నియోజకవర్గాలలో 2018 నాటికి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు సీట్లకే పరిమితం అయింది. బిజెపి 9 సీట్లు, జెడిఎస్ ఆరు సీట్లు ఆనాడు గెలుచుకున్నాయి. భారత్ జోడోయాత్ర కారణంగా ప్రస్తుత ఎన్నికల్లో ఈ 20 నియోజకవర్గాలలో ఏకంగా 15 సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బిజెపి రెండు స్థానాలకు, జెడిఎస్ మూడు స్థానాలకు పరిమితమయ్యాయి. భారత్ జోడో పాదయాత్ర కొనసాగిన ఏడు జిల్లాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర చేయని సెగ్మెంట్లపై కూడా కాంగ్రెస్ ప్రభావం చూపింది. పాదయాత్ర కొనసాగిన 7 జిల్లాల్లో మొత్తం 51 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 36 చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రాహుల్ గాంధీ ప్రచార వ్యూహం ఒక్కసారిగా మారడం కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. కర్ణాటక ఎన్నికల ప్రచారం ప్రారంభమైన తొలి రోజుల్లో రాహుల్ గాంధీ జాతీయ అంశాలను మరీ ముఖ్యంగా ఆదానీ వ్యవహారాన్ని, చైనా చెరుబాటు అంశాన్ని ప్రస్తావించారు. కానీ పోలింగ్ దగ్గర పడుతున్న రోజుల్లో ఆయన వ్యూహం మార్చి స్థానిక అంశాలకు ప్రాధాన్యత పెంచారు. ప్రజా సమస్యలను రాహుల్ గాంధీ ప్రస్తావించడం కలిసి వచ్చిందని కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.

హోరాహోరీ ప్రచారం..

ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ ప్రియాంక వధేరా కూడా పాల్గొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 80 ఏళ్ల వయస్సులో కూడా ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు మొత్తం 99 బహిరంగ సభలు నిర్వహించారు. 33 రోడ్డు షోలు నిర్వహించారు. రాహుల్ గాంధీ పోలింగ్‌కి మూడు, నాలుగు రోజుల ముందు సామాన్య ప్రజానీకంతో మమేకం అయ్యేందుకు ప్రయత్నించారు. లోకల్ బస్సుల్లో తిరిగారు. టూవీలర్లపై పర్యటనలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే రాష్ట్ర నాయకత్వం సమిష్టిగా పనిచేయడం బాగా కలిసి వచ్చిన అంశంగా కనిపిస్తోంది. సీఎం సీటు కోసం నువ్వా నేనా అన్నట్లు ప్రకటనలు చేసిన మాజీ సీఎం సిద్ధరామయ్య, కెపిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా కొంత పరస్పర సహకారంతో పని చేస్తున్నట్లు మెసేజ్ పంపించగలిగారు. తనతో పోటీపడుతున్న డీకే శివకుమార్‌కు కూడా సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయంటూ సిద్ధరామయ్య కామెంట్ చేయడం ఆయన సంయమనానికి నిదర్శనంగా నిలిచింది. అదే సమయంలో తాను కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన పార్టీ అధిష్టానానికి కర్ణాటక విజయాన్ని గిఫ్ట్ గా ఇస్తానంటూ డీకే శివకుమార్ కష్టపడి పనిచేశారు. తాను సీఎం అవుతానని తన వక్కళిగ సామాజిక వర్గానికి స్పష్టమైన మెసేజ్ పంపడంతో ఓల్డ్ మైసూర్ ప్రాంతాల్లో జనతాదళ్ సెక్యులర్ పార్టీని గట్టిగా దెబ్బ కొట్టారు శివకుమార్. జేడిఎస్‌కు అండగా నిలుస్తూ వస్తున్న వక్కళిగ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ వైపు మళ్ళించారు శివకుమార్. ఒకరకంగా చెప్పాలంటే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఒక్క బండికి కట్టిన జోడెద్దుల మాదిరిగా కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించాలని చెప్పవచ్చు. గ్రౌండ్ లెవెల్‌లో బలమైన నేతగా పేరున్న మాజీ సీఎం సిద్ధరామయ్య, పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన డీకే శివకుమార్ రాష్ట్రమంతటా పర్యటించారు. డీకే శివకుమార్ తాను పోటీ చేసిన కనకపుర నియోజకవర్గంలో కేవలం ఒక్కరోజే ప్రచారం నిర్వహించినప్పటికీ 90 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో ఘన విజయం సాధించారు.

ఇవి కూడా చదవండి

ప్రచార పర్వాన్ని మార్చేసిన మేనిఫెస్టో

అయితే కాంగ్రెస్ మేనిఫెస్టో రాష్ట్రంలో ప్రచార పర్వాన్ని పూర్తిగా మార్చివేసింది. అప్పటివరకు ప్రచారంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు పక్కకు పోయి భజరంగ్ దళ్ వ్యవహారమే ప్రధాన అంశంగా మారిపోయింది. తాము అధికారంలోకి వస్తే భజరంగ్ దళ్‌ని నిషేధిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొనడాన్ని బిజెపి ఒక అస్త్రంగా తీసుకొని చతికిలా పడింది. బజరంగ్ దళ్ నిషేధ అంశాన్ని తీసుకుని హిందువుల ఓట్లను పోలరైజ్ చేసుకుని లబ్ధి పొందుదామనుకున్న కమలనాధులకు కర్ణాటక వాసులు పెద్ద షాకే ఇచ్చారు. జై బజరంగబలి అంటూ ప్రచార ప్రసంగాలను మొదలుపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పోలింగ్ రోజు జై బజరంగబలి అంటూ కమలం గుర్తు మీద ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అయితే కన్నడిగులు ఆయన అభ్యర్థనను పట్టించుకోలేదు. ఫలితంగా బిజెపి ఘోర పరాజయం పాలయింది. 104 సీట్ల నుంచి 64 స్థానాలకు ఆ పార్టీ నెంబర్ పడిపోయింది. బజరంగబలి నినాదాన్ని బిజెపి అందుకోవడంతో మ్యానిఫెస్టోలో పెట్టినప్పటికీ బజరంగ్ దళ్ నిషేధం అంశాన్ని కాంగ్రెస్ నేతలు ప్రచార పర్వంలో పెద్దగా వినియోగించుకోలేదు. హిందువుల ఓట్లకు గండి పడుతుందన్న భయంతో వారు వెనక్కి తగ్గారు. ఇక కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిన మరో అంశం లింగాయత్‌ల ఓట్లు. తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీ పంచన చేరారు. లింగాయత్ ఓట్లకు ఆయన గాలమేశారు. ఆయన ఓడిపోయినప్పటికీ లింగాయత్తుల ఓట్లను బిజెపి నుంచి కాంగ్రెస్ వైపు మళ్ళించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. బిజెపిలోనే ఉన్న లింగాయత్ నేత యడియూరప్పకు బిజెపి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. దాంతో ముంబై కర్ణాటక, సెంట్రల్ కర్ణాటక ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ గణనీయమైన ఓట్లు సాధించుకోగలిగింది. మల్లికార్జున ఖర్గే కర్ణాటకకు చెందిన వారవడం కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఆయన ప్రాతినిధ్యం వహించే హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గణనీయమైన సీట్లు గెలుచుకుంది. బసవరాజు బొమ్మై సారధ్యంలోని బిజెపి ప్రభుత్వం 40 శాతం కమిషన్లు తీసుకునే అవినీతిమయ ప్రభుత్వంగా కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లగలడం కూడా ఆ పార్టీకి కలిసి వచ్చింది. దీన్ని తిప్పికొట్టేందుకు మోదీా.  కాంగ్రెస్ రక్తంలోనే 85% అవినీతి ఇమిడి ఉందని పదేపదే చెప్పకొచ్చినా కన్నడిగులు విశ్వసించలేదు. బిజెపికి స్థానికంగా బలమైన నాయకత్వం లేకపోవడం.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం సమిష్టిగా పని చేయడం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను విపరీతంగా ప్రభావితం చేసిందని చెప్పాలి.

కాంగ్రెస్ పార్టీ పంచసూత్ర పథకాలు

కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన పంచసూత్ర పథకాలు ప్రజల మన్నన పొందినట్లు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. గృహ జ్యోతి యోజనె,  గృహలక్ష్మి యోజనె, అన్నభాగ్య, యువనిధి, మహిళలకు ఉచిత ప్రయాణ అనే పంచ సూత్రాలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు సంపాదించిపెట్టాయి.  ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును అందజేయడం గృహజ్యోతి యోజన ఉద్దేశం. ఇంటి పెద్దగా ఉండే ప్రతి మహిళకు నెలకు 2 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం గృహలక్ష్మి యోజన. దీని ద్వారా రాష్ట్రంలో కోటిన్నర మంది మహిళలకు లబ్ధి కలుగుతుందన్నది లక్ష్యం. దరిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నెలకు 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయడం అన్నభాగ్య పథకం. డిగ్రీ చదివిన ప్రతి నిరుద్యోగికి నెలకు 3 వేలు, డిప్లమా చేసి ఏ ఉద్యోగం లేకుండా ఉన్నవారికి 1500 రూపాయలు నిరుద్యోగ భృతిగా ఇస్తామనడం యువనిధి పథకం. ఇక రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామనడం మహిళలను విశేషంగా ప్రభావితం చేసిందని చెప్పాలి. దీని ద్వారా కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పూర్తిగా దివాళా. తీసే ప్రమాదం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ ఉచిత హామీతో బహు బాగా లబ్ధి పొందింది. అయితే ఇక్కడ ఒక అంశాన్ని ప్రస్తావించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ పంచ సూత్రాల మేనిఫెస్టో రూపకల్పన వెనక ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. శశికాంత్ సెంథిల్ అని మాజీ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం కాంగ్రెస్ వార్ రూమ్ ఇంచార్జ్ వ్యవహరిస్తున్నారు. ఆయన క్షేత్రస్థాయిలో జరిపిన సర్వేల ఆధారంగా ఈ పంచ సూత్ర పథకాలను రూపొందించి కాంగ్రెస్ పెద్దలను ఒప్పించి మరి మేనిఫెస్టోలో చొప్పించ గలిగారు. ఇది పార్టీకి బాగా కలిసి వచ్చిన అంశం. గతంలో కర్ణాటకలోని చిత్రదుర్గ, రాయచూరు జిల్లాలకు శశికాంత్ కలెక్టర్‌గా పని చేశారు. 2020 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఐఏఎస్ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేనిఫెస్టో రూపకల్పన వెనుక శశికాంత్ భారీ కసరత్తు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద బిజెపికి రాష్ట్ర నాయకత్వం సరిగ్గా లేకపోవడం, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరంటే ఇదమిత్తంగా వీరు అని చెప్పలేకపోవడం నష్టం కలిగించింది. అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి రాష్ట్ర సమస్యలకే ప్రజలు పెద్దపీట వేసినట్లు ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా