Shocking: దారుణం.. పదే పదే మూత్రం పోస్తున్నాడని చిన్నారి ప్రైవేట్ పార్ట్‌కి నిప్పంటించిన టీచర్..

Shocking: పసి పిల్లలకు తినడమే సరిగా తెలియదు.. అలాంటిది కాలకృత్యాలు వారంతట వారే ఎలా తీర్చుకోగలరు. మూత్రం, మలం ఎప్పుడు..

Shocking: దారుణం.. పదే పదే మూత్రం పోస్తున్నాడని చిన్నారి ప్రైవేట్ పార్ట్‌కి నిప్పంటించిన టీచర్..
School
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 31, 2022 | 10:18 PM

Shocking: పసి పిల్లలకు తినడమే సరిగా తెలియదు.. అలాంటిది కాలకృత్యాలు వారంతట వారే ఎలా తీర్చుకోగలరు. మూత్రం, మలం ఎప్పుడు వస్తుందో వారెలా చెప్పగలరు. ఈ విషయంపై కనీస జ్ఞానం లేని, కిరాతకురాలు.. ఓ చిన్నారి పదే పదే మూత్రం పోస్తున్నాడని అతని ప్రైవేట్ పార్ట్‌కు నిప్పటించింది. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది.

సాధారణంగానే చిన్న పిల్లలు అల్లరి చేష్టలు చేస్తుంటారు. వారి చేష్టలను పెద్దలు భరించక తప్పదు. ఎందుకంటే వారికి లోకజ్ఞానం తెలియదు మరి. ఆ చెడు అలవాట్లు మానాలంటే.. వారికి ఓపికగా విషయాలను చెప్పాల్సి ఉంటుంది. ఇంట్లో తల్లిదండ్రులు అయినా, స్కూల్లో టీచర్లు అయినా వారిని సముదాయించాలి. కానీ, ఈ టీచర్ మరీ రాక్షసంగా ప్రవర్తించింది. మూత్రం పోశాడనే కారణంతో.. బాబు పురుషాంగానికి వాత పెట్టింది.

కర్ణాటకలోని తమకూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని ఓ అంగన్‌వాడి సెంటర్‌లో ఓ చిన్నారి ప్యాంట్‌లో తరచూ మూత్ర విసర్జన చేస్తున్నాడు. పదే పదే ఇలా చేస్తుండటంతో అంగన్వాడీ టీచర్‌కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చిన్నారిని భయపెట్టాలనే ఉద్దేశంతో అతని ప్రైవేట్ పార్ట్‌కు వాత పెట్టింది. దాంతో తీవ్రంగా గాయపడ్డ బాలుడు.. గుక్కపట్టి ఏడ్చాడు. ఇంటికి వచ్చాక కుటుంబ సభ్యులు అది గమనించి టీచర్‌ నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి ప్రైవేట్ పార్ట్‌తో పాటు.. తొడలపైనా వాతలు పెట్టినట్లు అతని వారు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు.. విచారణ జరిపారు. అంగన్‌వాడీ టీచర్, సహాయకులకు నోటీసులు జారీ చేశారు. గాయపడిన చిన్నారికి జన స్వాస్థ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కొద్ది రోజుల క్రితమే తల్లి మృతి..

కాగా, ఇందులో మరో హృదయవిదారక ఘటన ఉంది. 15 రోజుల క్రితమే బాలుడి తల్లి క్యాన్సర్‌తో కన్నుమూసింది. చిన్నారి ప్రస్తుతం తన అమ్మమ్మ, తండ్రితో కలిసి నివసిస్తున్నాడు. ఈ చిన్నారి అన్నయ్య 6వ తరగతి చదువుతున్నాడు. తల్లి ఉన్నంతకాలం చిక్‌మగళూరులో నివసించగా.. తల్లి మరణానంతరం గోడకెరె గ్రామానికి వచ్చారు. అయితే, బాధిత చిన్నారికి తరచూ మూత్ర విసర్జన చేసే అలవాటు ఉందని, అది మాన్పించేలా చూడమని చిన్నారి అమ్మమ్మ అంగన్‌వాడీ టీచర్‌ని, సహాయకురాలిని కోరినట్లు వారు చెబుతున్నారు. అదిలించమని చెబితే.. ఇంత పని చేస్తారని ఊహించలేదని చిన్నారి అమ్మమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..