AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: కర్ణాటకలో ‘గౌరవంగా చనిపోయే హక్కు’ అమలు.. వారికి గొప్ప ఉపశమనం

ప్రాణాంతక జబ్బులతో బాధపడుతూ లైఫ్ సపోర్ట్‌తో కూడా కోలుకోని రోగులు ‘గౌరవంగా చనిపోయే హక్కు’ను కర్ణాటక ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ హక్కును ప్రసాదించే ముందు రెండు దశల్లో మెడికల్ రివ్యూ ఉంటుంది.. ఆ వివరాలు..

Karnataka: కర్ణాటకలో ‘గౌరవంగా చనిపోయే హక్కు’ అమలు.. వారికి గొప్ప ఉపశమనం
Karnataka
Ravi Kiran
|

Updated on: Feb 02, 2025 | 6:00 AM

Share

ప్రాణాంతక జబ్బులతో బాధపడుతూ లైఫ్ సపోర్ట్‌తో కూడా కోలుకోని రోగులు ‘గౌరవంగా చనిపోయే హక్కు’ను కర్ణాటక ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ హక్కును ప్రసాదించే ముందు రెండు దశల్లో మెడికల్ రివ్యూ ఉంటుంది. ప్రాథమిక బోర్డులోని ముగ్గురు వైద్యులు రోగి పరిస్థితిని పర్యవేక్షిస్తారు. అంతేమంది వైద్యులతోపాటు ప్రభుత్వం నియమించిన వైద్యుడితో కూడిన సెకండరీ బోర్డు కోర్టుకు నివేదిక సమర్పించడానికి మొదటి బోర్డు గుర్తించిన అంశాలను పరిశీలిస్తుంది.

ఆ నివేదికను పరిశీలించిన కోర్టు.. దీనికి అంగీకరిస్తే వైద్య నిపుణుల పర్యవేక్షణలో రోగి లైఫ్ సపోర్ట్‌ను తొలగించి అతడు ప్రశాంతంగా చనిపోయే అవకాశం కల్పిస్తారు. అయితే, సంబంధిత రోగి బంధువులు కోరిన మీదటే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కోలుకోలేని రోగులకు దీర్ఘకాలిక బాధల నుంచి విముక్తి కల్పించడంపై దృష్టి పెట్టిన సుప్రీంకోర్టు.. ఇలాంటి వారికి గౌరవప్రదంగా చనిపోయే హక్కును కల్పించాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండురావ్ ‘ఎక్స్’ ద్వారా తెలిపారు. కోలుకోలేని ప్రాణాంతక జబ్బులతో బాధపడుతున్న రోగులకు దీనివల్ల ప్రయోజనం ఉంటుందని అన్నారు. ఇది చాలా ముఖ్యమైన అడుగు అని, దీని వల్ల చాలా కుటుంబాలు, వ్యక్తులకు గొప్ప ఉపశమనం లభిస్తుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు