Kamal Haasan: కమల్ హసన్ పార్టీ నుంచి మరో సీనియర్ నేత నిష్క్రమణ.. చివరకు ‘భారతీయుడే’ మిగులుతారా ?
సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హసన్ కి షాకుల మీద షాక్ తగులుతోంది. తమిళనాడు ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓటమి పాలు కావడంతో పార్టీ నుంచి ఒక్కొక్కరుగా వైదొలగుతున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ కనీసం ఒక్క సీటునైనా గెలుచుకోలేకపోయింది...
సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హసన్ కి షాకుల మీద షాక్ తగులుతోంది. తమిళనాడు ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓటమి పాలు కావడంతో పార్టీ నుంచి ఒక్కొక్కరుగా వైదొలగుతున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ కనీసం ఒక్క సీటునైనా గెలుచుకోలేకపోయింది. మూడేళ్ళ క్రితం ఏర్పడిన ఈ పార్టీ ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తాజాగా పార్టీ నుంచి టాప్ లీడర్ సి.కె.కుమర్ వెల్ నిష్క్రమించారు. ‘ నో హీరో వర్షిప్ ‘ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈయన రాజీనామాతో ఇప్పటివరకు పార్టీని వీడినవారి సంఖ్య ఆరుకు పెరిగింది. ‘మేం చరిత్ర సృష్టించాలనుకున్నాం.. కానీ మేం చరిత్రను చదువుతున్నాం’ సెక్యులర్ డెమొక్రటిక్ పాలిటిక్స్ లో నేను ప్రయణించాలనుకున్నా.. కానీ అది సాధ్యం కాలేదు’ అని ఆయన కమల్ హసన్ కి పంపిన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
మొదట ఈ పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్.మహేంద్రన్ , ప్రధాన కార్యదర్శి సంతోష్ బాబు రాజీనామా చేయగా..ఆ తరువాత పర్యావరణ యాక్టివిస్ట్ పద్మప్రియ వ్యక్తిగత కారణాలు చూపి వైదొలిగారు. నిన్నటికి నిన్న మరో ప్రధాన కార్యదర్శి ఎం.మురుగానందం నిష్క్రమించారు. నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలనుకున్నానని, కానీ పార్టీలో ఇందుకు అనువైన వాతావరణం లేదని ఆయన అన్నారు. బలహీనమైన పార్టీలతో మక్కల్ నీది మయ్యం పొత్తు పెట్టుకున్నదని ఆయన ఆరోపించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో బాటు అన్ని పదవులకూ రాజీనామా చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
కాగా మొదట పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రన్ రాజీనామా చేసినప్పుడు కమల్ హసన్…పార్టీ నుంచి కలుపు మొక్క వెళ్లడం మంచిదే అయిందని వ్యాఖ్యానించారు. మహేంద్రన్ వెళ్ళిపోతాడని తాను అప్పుడే ఊహించానని ఆయన అన్నారు. మొత్తానికి మే నెల 3 నుంచి మక్కల్ నీది మయ్యానికి గ్రహణం పట్టుకుంది.
మరిన్ని చదవండి ఇక్కడ : Madhya Pradesh: కోవిడ్ సెంటర్‌లో టాయిలెట్ క్లీన్ చేసిన బీజేపీ ఎంపీ… ( వీడియో )
మధ్యదరా సముద్రంలో ఘోరం….!! పడవ మునిగి 57 మంది మృతి… ( వీడియో )