JNU ATTACK.. బాలీవుడ్ సపోర్ట్.. ముంబైలో ప్రొటెస్ట్

ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీలో విద్యార్థులపై జరిగిన దాడిని బాలీవుడ్ ఖండించింది. ఆ దాడికి నిరసనగా ముంబైలో బాలీవుడ్ స్టార్స్ అంతా కార్టర్ రోడ్డులో శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో విశాల్ భరద్వాజ్, అనురాగ్ కశ్యప్, అనుభవ్ సిన్హా, తా ప్సీ పొన్ను, దియా మీర్జా, రిచా ఛధ్ధా, గౌహార్ ఖాన్ వంటి పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. నినాదాలు చేస్తూ, పాటలు పాడుతూ, గేయ కవితలు చదువుతూ.. ఈ ప్రదర్శన సాగింది. దేశంలో విద్యార్థులపై ఇప్పటికే […]

  • Umakanth Rao
  • Publish Date - 1:00 pm, Tue, 7 January 20
JNU ATTACK.. బాలీవుడ్ సపోర్ట్.. ముంబైలో ప్రొటెస్ట్

ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీలో విద్యార్థులపై జరిగిన దాడిని బాలీవుడ్ ఖండించింది. ఆ దాడికి నిరసనగా ముంబైలో బాలీవుడ్ స్టార్స్ అంతా కార్టర్ రోడ్డులో శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో విశాల్ భరద్వాజ్, అనురాగ్ కశ్యప్, అనుభవ్ సిన్హా, తా ప్సీ పొన్ను, దియా మీర్జా, రిచా ఛధ్ధా, గౌహార్ ఖాన్ వంటి పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. నినాదాలు చేస్తూ, పాటలు పాడుతూ, గేయ కవితలు చదువుతూ.. ఈ ప్రదర్శన సాగింది. దేశంలో విద్యార్థులపై ఇప్పటికే ఎన్నో దాడులు జరిగాయని, ఇక వీటికి స్వస్తి పలకాలని కోరుతున్న ప్లకార్డులు, పోస్టర్లను వీరు ప్రదర్సించారు.  విద్యార్థులే ఈ దేశ భవిష్యత్ నిర్దేశకులని, వారికి ఉన్నతమైన ఫ్యూచర్ ఇవ్వాలని వీరు డిమాండ్ చేశారు. అటు-మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం

జెఎన్ యు ఘటనను ఖండించింది. ఆ యూనివర్సిటీ విద్యార్థులకు, ఫ్యాకల్టీ సభ్యులకు మద్దతు ప్రకటించింది. 2008 లో ముంబైలో జరిగిన దాడితో ఈ నెల 6 వ తేదీన సంభవించిన ఘటనలను ప్రభుత్వం పోల్చింది. స్వయంగా సీఎం ఉధ్ధవ్ థాక్రే ఈ ఘటనపై స్పందిస్తూ.. నాటి దృశ్యాలను తాను టీవీలో చూశానని, అలాంటి  ఘటనలను తమ రాష్ట్రంలో జరగనివ్వబోమని అన్నారు. ఢిల్లీ పోలీసులను ఆయన దుయ్యబట్టారు. పరిస్థితిని వారు సరిగా హ్యాండిల్ చేయలేకపోయారని ఆయన విమర్శించారు. కాగా…  బాలీవుడ్ సెలబ్రిటీలంతా.. ప్రదర్శన అనంతరం ‘ జనమనగణమన ‘ జాతీయ గీతం ఆలపించారు.