ఆ దాడికి మాదే బాధ్యత.. రంగంలో కొత్త ‘ గ్రూప్ ‘.. హిందూ రక్షా దళ్

జవహర్లాల్ నెహ్రు విశ్వవిద్యాలయంలో ఆదివారం రాత్రి జరిగిన దాడికి తమదే పూర్తి బాధ్యత అని ఓ కొత్త గ్రూపు ప్రకటించుకుంది. ‘ హిందూ రక్షా దళ్ ‘ అనే ఈ సంస్థ నేత పింకీ చౌదరి ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఈ వర్సిటీ జాతి వ్యతిరేక శక్తులకు నిలయంగా మారిందని, దీన్ని తాము సహించలేకపోయామని, అందువల్లే దాడికి పాల్పడ్డామని ఆయన అన్నారు. ఆ ఎటాక్ లో పాల్గొన్నది మా సంస్థ కార్యకర్తలే అని స్పష్టం […]

ఆ దాడికి మాదే బాధ్యత.. రంగంలో కొత్త ' గ్రూప్ '.. హిందూ రక్షా దళ్
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 07, 2020 | 5:20 PM

జవహర్లాల్ నెహ్రు విశ్వవిద్యాలయంలో ఆదివారం రాత్రి జరిగిన దాడికి తమదే పూర్తి బాధ్యత అని ఓ కొత్త గ్రూపు ప్రకటించుకుంది. ‘ హిందూ రక్షా దళ్ ‘ అనే ఈ సంస్థ నేత పింకీ చౌదరి ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఈ వర్సిటీ జాతి వ్యతిరేక శక్తులకు నిలయంగా మారిందని, దీన్ని తాము సహించలేకపోయామని, అందువల్లే దాడికి పాల్పడ్డామని ఆయన అన్నారు. ఆ ఎటాక్ లో పాల్గొన్నది మా సంస్థ కార్యకర్తలే అని స్పష్టం చేశారు. ఆయన ప్రకటనలోని నిజానిజాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. బీజేపీ అనుబంధ విభాగమైన ఏబీవీపీఏ దాడులకు దిగిందని  ఆరోపణలు వస్తున్న వేళ.. వాటి నుంచి ఆ సంస్థను తప్పించడానికే హిందూ రక్షా దళ్ అనే ఈ సంస్థను తెరపైకి తెచ్చారని క్రిటిక్స్ భావిస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయం హాస్టళ్లలోకి చేతుల్లో ‘ ఆయుధాలు ‘ ధరించి.. ముఖాలకు ముసుగులతో ప్రవేశించిన వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు ‘ ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్ వేర్ ‘ ను వినియోగిస్తున్నారు. అలాగే పలు వీడియో క్లిప్ లను స్కాన్ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో బయో మెట్రిక్స్ ను తప్పనిసరిగా వాడవలసి ఉంటుంది. కాగా- రక్తమోడుతున్న ముఖంతో కనిపించిన విద్యార్ధి సంఘం నేత ఐషే ఘోష్.. ఈ దాడికి ఏబీవీపీదే బాధ్యత అని ఆరోపించగా.. దీన్ని ఖండించిన ఏబీవీపీ.. ఇందుకు లెఫ్ట్ విద్యార్థులే కారకులని ప్రత్యారోపణ చేసింది.

4 నిముషాల్లో ఆమెపై మరో రెండు కేసులు…

దాడిలో తీవ్రంగా గాయపడిన ఐషే ఘోష్ ఆసుపత్రికి వెళ్తుండగా.. కేవలం 4 నిముషాల్లోనే రెండు కేసులను ఆమెపై పోలీసులు నమోదు చేశారు. యూనివర్సిటీ యాజమాన్యం ఈమెపైన, మరికొందరిపైనా ఫిర్యాదు చేసినట్టు వారు తెలిపారు. సోమవారానికి మూడు ఎఫ్ ఐ ఆర్ ల వివరాలు బహిర్గతమయ్యాయి. అయితే మూడోదానిలో వర్సిటీ ఆవరణలో చొరబడి..హాస్టళ్లలోని విద్యార్థులు, ప్రొఫెసర్లపై దాడికి దిగినవారి పేర్లు మాత్రం ఇందులో కనిపించలేదు.