టాలీవుడ్ ప్రముఖ దర్శకుడి ఇంట విషాదం…
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి చంద్రమౌళి(92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతోన్న ఆయన నేడు(జనవరి7) స్వగృహంలోనే తనువు చాలించారు. కాగా చంద్రమౌళికి డాక్టరుగా మంచి పేరుంది. అంతేకాదు ఆర్‌ఎస్‌ఎస్‌లో కీలక కార్యకర్తగా పనిచేస్తూ..ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైరయ్యారు. ఇక ఇంటర్నేషనల్ డాక్టర్స్ అసోసియేషన్‌కు రెండు సార్లు ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఆయన ముగ్గురు కుమారుల్లో ఒకరైన జయంత్ సి […]
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి చంద్రమౌళి(92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతోన్న ఆయన నేడు(జనవరి7) స్వగృహంలోనే తనువు చాలించారు. కాగా చంద్రమౌళికి డాక్టరుగా మంచి పేరుంది. అంతేకాదు ఆర్‌ఎస్‌ఎస్‌లో కీలక కార్యకర్తగా పనిచేస్తూ..ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైరయ్యారు. ఇక ఇంటర్నేషనల్ డాక్టర్స్ అసోసియేషన్‌కు రెండు సార్లు ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఆయన ముగ్గురు కుమారుల్లో ఒకరైన జయంత్ సి పరాన్టీ టాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయమై..అగ్రకథానాయకులు చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లాంటి నటులతో సినిమాలు తీశారు. కాగా బుధవారం (జనవరి 8) చంద్రమౌళి అంత్యక్రియలు జరగనున్నాయి.