విదేశీ వధువు పెళ్ళికి రాష్ట్రపతి ‘ ఆమోద ముద్ర ‘ !
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఏష్లే హాల్ అనే విదేశీ యువతి పెళ్ళికి ఆయన తనకు తెలియకుండానే ‘ అడ్డుపడ్డారు’. వివరాల్లోకి వెళ్తే.. ఈ యువతి వివాహం కేరళలోని కోచ్చి లో గల ఓ హోటల్లో జరగాల్సి ఉంది. అయితే లక్ష ద్వీప్ కు వెళ్తూ.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సోమవారం రాత్రి ఇదే హోటల్లో ఉండిపోయారు.. తెల్లారితే మంగళవారం.. ఇదే రోజున ఈమె వెడ్డింగ్ జరగాల్సి ఉంది. కానీ […]
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఏష్లే హాల్ అనే విదేశీ యువతి పెళ్ళికి ఆయన తనకు తెలియకుండానే ‘ అడ్డుపడ్డారు’. వివరాల్లోకి వెళ్తే.. ఈ యువతి వివాహం కేరళలోని కోచ్చి లో గల ఓ హోటల్లో జరగాల్సి ఉంది. అయితే లక్ష ద్వీప్ కు వెళ్తూ.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సోమవారం రాత్రి ఇదే హోటల్లో ఉండిపోయారు.. తెల్లారితే మంగళవారం.. ఇదే రోజున ఈమె వెడ్డింగ్ జరగాల్సి ఉంది. కానీ రాష్ట్రపతి ఓవర్ నైట్ స్టే కారణంగా ఏష్లే వెడ్డింగ్ ట్రబుల్స్ లో పడడంతో ఆమె ఆందోళనకు అంతులేకపోయింది. వెంటనే ఈమె తన ట్విట్టర్ ద్వారా రాష్ట్రపతి భవన్ కు ఓ విజ్ఞప్తి ట్వీట్ చేసింది. తన మ్యారేజీ ఈ నెల 7 న ‘ తాజ్ వివాంటా అనే హోటల్లో జరగనుందని, అయితే రాష్ట్రపతి స్టే కారణంగా దీనికి అవరోధం ఏర్పడిందని, ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరించి తన పెళ్లి జరిగేట్టు చూడవలసిందిగా కోరింది. దీంతో సిబ్బంది వెంటనే స్పందించారు. ఈ హోటల్లోని సంబంధిత హాల్ లో ఈమె వివాహం సజావుగా జరిగేట్టు చూడవలసిందిగా ఆ హోటల్లో విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు. మొత్తానికి రాష్ట్రపతి కూడా స్పందించి ఏష్లే వివాహానికి అనువుగా చర్యలు తీసుకున్నారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు అమెరికాకు చెందిన ఈ నూతన వధువు ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది.
I want to thank the @Taj_Cochin and State Officials for working on this with us throughout the day. Hoping we can have a beautiful wedding with the blessings of The Honorable @rashtrapatibhvn. https://t.co/i6lR4D9YDQ
— Ashley Hall (@hall_ash) January 5, 2020
We are glad the issues have been resolved. President Kovind conveys his best wishes to you on this joyous occasion
— President of India (@rashtrapatibhvn) January 5, 2020