జెఎన్ యు ఘటన…. ఏబీవీపీని వదిలి.. విద్యార్ధి సంఘం నేతపై కేసు

ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రు విశ్వవిద్యాలయంలో జరిగిన హింసాకాండపై పోలీసులు 18 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిలో జె ఎన్ యు విద్యార్ధి సంఘం నేత ఐషే ఘోష్ కూడా ఉన్నారు. అయితే ఈ నెల 5 వ తేదీ (ఆదివారం) రాత్రి క్యాంపస్ లో జరిగిన ‘  గూండాగిరీ ‘ ఘటనలను పక్కన బెట్టి.. అంతకు ముందు.. అంటే.. ఈ నెల 4 న యూనివర్సిటీ సర్వర్ రూమ్ లో జరిగిన విధ్వంసానికి కారకులంటూ వీరిపై […]

జెఎన్ యు ఘటన.... ఏబీవీపీని వదిలి.. విద్యార్ధి సంఘం నేతపై కేసు
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jan 07, 2020 | 11:17 AM

ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రు విశ్వవిద్యాలయంలో జరిగిన హింసాకాండపై పోలీసులు 18 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిలో జె ఎన్ యు విద్యార్ధి సంఘం నేత ఐషే ఘోష్ కూడా ఉన్నారు. అయితే ఈ నెల 5 వ తేదీ (ఆదివారం) రాత్రి క్యాంపస్ లో జరిగిన ‘  గూండాగిరీ ‘ ఘటనలను పక్కన బెట్టి.. అంతకు ముందు.. అంటే.. ఈ నెల 4 న యూనివర్సిటీ సర్వర్ రూమ్ లో జరిగిన విధ్వంసానికి కారకులంటూ వీరిపై కేసు పెట్టారు. ఆదివారం జరిగిన హింసాకాండలో విద్యార్థులు, కొందరు ప్రొఫెసర్లతో సహా 34 మంది గాయపడ్డారు. వీరిలో ఐషే ఘోష్ కూడా ఒకరు. ఈ వర్సిటీ యాజమాన్యం దాఖలు చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని పోలీసులు ఐషే ఘోష్ సహా ఈ 18 మందినీ కేసుల్లో ‘ ఇరికించారు’. హాస్టల్ ఫీజు పెంపునకు నిరసనగా కొందరు విద్యార్థులు సర్వర్ రూమ్ లో విధ్వంసం సృష్టించారని, సెమిస్టర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను అడ్డుకునేందుకు సాంకేతిక సిబ్బందిని బెదిరించారని, పైగా సెక్యూరిటీ గార్డులపై కూడా దాడి చేశారని యూనివర్సిటీ యాజమాన్యం ఆరోపించింది. అయితే విద్యార్థి సంఘం నాయకులు ఈ ఆరోపణను ఖండిస్తూ..ముసుగులు ధరించిన సెక్యూరిటీ గార్డులను వినియోగించుకుని యాజమాన్యమే హాస్టళ్లలో దాడులు చేయించిందని పేర్కొన్నారు. కాగా.. బీజేపీకి అనుబంధంగా ఉన్న ఏబీవీపీ విద్యార్థులే ఆదివారం రాత్రి ఇనుపరాడ్లు, కర్రలతో హాస్టళ్లలో ప్రవేశించి బీభత్సం సృష్టించారని వార్తలు వఛ్చిన సంగతి తెలిసిందే. పైగా పోలీసులకు ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా లభించాయి. దాడులకు ముందు ఏబీవీపీకి చెందిన విద్యార్థుల మొబైల్ ఫోన్లలో వారి చాటింగ్ నిర్వాకాలు కూడా బయటపడ్డాయి. అయినా పోలీసులు ఈ దాడుల గురించి పట్టించుకోకుండా ఈ నెల 3, 4 తేదీలలో సర్వర్ రూమ్ లో జరిగిన ఘటనలకు కారకులంటూ 18 మంది మీద కేసులు నమోదు చేయడం విశేషం.