జేఎన్‌యూ ఘటన: ఢిల్లీ పోలీసులకు మహిళా కమిషన్ నోటీసులు

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆదివారం రాత్రి జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. ఈ ఘటనను పలువురు తీవ్రంగా ఖండించారు. కాగా ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులకు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ తాలూకు వివరాలను తమకు అందజేయాలని మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు, సీసీటీవీ ఫుటేజీ, పోలీసులు స్పందించకపోవడానికి గల […]

జేఎన్‌యూ ఘటన: ఢిల్లీ పోలీసులకు మహిళా కమిషన్ నోటీసులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 07, 2020 | 8:19 AM

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆదివారం రాత్రి జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. ఈ ఘటనను పలువురు తీవ్రంగా ఖండించారు. కాగా ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులకు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ తాలూకు వివరాలను తమకు అందజేయాలని మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు, సీసీటీవీ ఫుటేజీ, పోలీసులు స్పందించకపోవడానికి గల కారణాల నివేదికను తమకు అందజేయాలని తెలిపారు.

జేఎన్‌యూలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు పోలీసులకు వచ్చిన కాల్స్‌ పీసీఆర్‌ జాబితాను అందించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే ఘటన జరిగిన తరువాత అంబులెన్సులను, మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించకపోవడానికి గల కారణాలేంటి? అని కూడా వారు ఆ నోటీసుల్లో ప్రశ్నించారు. వీటన్నింటిపై సంబంధిత పోలీసులు జనవరి 8న డీసీడబ్ల్యూ కార్యాలయంలో హాజరు కావాలని మహిళా కమిషన్ నోటీసుల్లో తెలిపింది. ఇక ఈ ఘటనపై వర్సిటీ రిజిస్ట్రార్‌కు కూడా సీడబ్ల్యూసీ నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై నమోదైన అన్ని ఫిర్యాదుల కాపీలతో వర్సిటీ రిజిస్ట్రార్‌ తమ ముందు హాజరు కావాలని మహిళా కమిషన్ సూచించింది.