జార్ఖండ్ జడ్జి హత్య కేసుపై సుప్రీంకోర్టు సీరియస్.. సీబీఐకి నోటీసులు జారీ చేసిన చీఫ్ జస్టిస్ రమణ
జార్ఖండ్ జడ్జి హత్య కేసుపై సుప్రీంకోర్టులో సుమోటో విచారణ సాగుతోంది. హత్య కేసుపై దర్యాప్తు చేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు.
Supreme court chief justice NV Ramana: జార్ఖండ్ జడ్జి హత్య కేసుపై సుప్రీంకోర్టులో సుమోటో విచారణ సాగుతోంది. హత్య కేసుపై దర్యాప్తు చేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనుకూలంగా తీర్పు రాకపోతే న్యాయవ్యవస్థను కించపరడచం దురదృష్టకరమని అన్నారు.
కోర్టు న్యాయమూర్తులు బెదిరింపుల గురించి ఫిర్యాదు చేసినప్పుడు సీబీఐ కానీ, ఇతర దర్యాప్తు సంస్థలు ఎందుకు స్పందించవని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. జార్ఖండ్ జిల్లా జడ్జి హత్య కేసును సుప్రీంకోర్టు సుమోటో విచారణ చేపట్టినందున సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులు ఫిర్యాదు చేసినప్పుడు ఎందుకు సహాయం చేయడంలేదని చీఫ్ జస్టిస్ అన్నారు.
“సీబిఐ తన వైఖరిని మార్చుకోలేదు. బెదిరింపులపై సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరోకు న్యాయమూర్తులు ఫిర్యాదు చేసినప్పుడు వారు స్పందించరు. దర్యాప్తు సంస్థలు ఏమాత్రం సహాయపడవు మరియు నేను కొంత బాధ్యతతో ఈ ప్రకటన చేస్తున్నాను” అని చీఫ్ జస్టిస్ రమణ అన్నారు. .
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ (49) జూలై 28 న ఉదయం పరుగెత్తుతున్న సమయంలో ఆటో ఢీకొట్టడంతో మరణించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలు రికార్డు అయ్యాయి. నిర్జనమైన రహదారి వెంట జడ్జి నడుచుకుంటూ వెళ్తుండగా, ఆటో నేరుగా వెళ్లి అతడిని ఉద్దేశపూర్వకంగా కొట్టినట్లు చూపించాయి. ఈ సంఘటన జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో సాక్షులు లభించలేదు. కాగా, ధన్బాద్‌లో అనేక మాఫియా హత్యల కేసులను జడ్జి ఆనంద్ నిర్వహిస్తున్నారు. ఈ కేసు సంబంధించి ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల బెయిల్ అభ్యర్థనలను తిరస్కరించారు. ఎమ్మెల్యే సంజీవ్ సింగ్ సన్నిహితుడు రంజయ్ సింగ్ హత్య కేసు కూడా అతని కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో జడ్జి ఆనంద్ హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.
అయితే, ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు నామమాత్రంగా దర్యాప్తు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తు చేస్తున్న అంశాలలో పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో జాప్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్యపై ఆగ్రహావేశాల మధ్య, సుప్రీంకోర్టు ఈ కేసును స్వయంగా స్వీకరించింది. దీంతో ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తూ, సుప్రీం కోర్టు న్యాయ అధికారులపై దాడుల నివేదికలపై ఆందోళన వ్యక్తం చేసింది.”ఈ ధన్ బాద్ కేసు విస్తృత పరిణామాలను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా న్యాయ అధికారులపై దాడులు జరుగుతున్నట్లు మాకు నివేదికలు అందుతున్నాయి. మేము దీనిని పరిశీలించాలనుకుంటున్నాము. అన్ని రాష్ట్రాల నుండి నివేదికను కోరుతున్నాము” అని చీఫ్ జస్టిస్ రమణ అన్నారు.
Read Also… Covid-19 Vaccine: వ్యాక్సిన్ తీసుకోకుండా ఆఫీస్‌కు వచ్చారు.. అది తెలిసి యాజమాన్యం ఏం చేసిందంటే..?