Hemant Soren: కట్టుదిట్టమైన భద్రత నడుమ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను విచారిస్తున్న ఈడీ..
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ని ముప్పుతిప్పలు పెట్టిన జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్, ఎట్టకేలకు ఒకే చెప్పారు. ఇప్పటిదాకా ఈడీ పంపిన ఏడు సమన్లను ఆయన పట్టించుకోలేదు. తన అధికారిక కార్యక్రమాలను, ఇతరత్రా కారణాలను చెప్పి ఈడీ ముందుకు వచ్చేందుకు ఏడుసార్లు తప్పించుకున్నారు. తాజాగా ఎనిమదో సారి ఇచ్చిన నోటీసులకు సానుకూలంగా స్పందించారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ని ముప్పుతిప్పలు పెట్టిన జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్, ఎట్టకేలకు ఒకే చెప్పారు. ఇప్పటిదాకా ఈడీ పంపిన ఏడు సమన్లను ఆయన పట్టించుకోలేదు. తన అధికారిక కార్యక్రమాలను, ఇతరత్రా కారణాలను చెప్పి ఈడీ ముందుకు వచ్చేందుకు ఏడుసార్లు తప్పించుకున్నారు. తాజాగా ఎనిమదో సారి ఇచ్చిన నోటీసులకు సానుకూలంగా స్పందించారు. పైగా ఈడీ ముందుకు ఆయన రాలేదు. జనవరి 20వ తేదీన తన అధికారిక నివాసానికే వచ్చి, స్టేట్‌మెంట్ రికార్డు చేసుకోవాలని అధికారులకు జార్ఖండ్ సీఎం సమాచారం ఇచ్చారు. దీంతో ల్యాండ్ స్కామ్ కేసులో దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు.
మైనింగ్ స్కాంలో జార్ఖండ్ సీఎం హేమంత్‌సోరెన్ ఈడీ అధికారులు విచారించారు. రాంచీ లోని సోరెన్ నివాసంలో ఆయన్ను ప్రశ్నించారు. మైనింగ్ స్కామ్‌లో రూ. 1,000కోట్ల కుంభకోణం జరిగిందని ఈడీ అభియోగాలు మోపింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు హేమంత్ సోరెన్. బీజేపీ కేంద్రం ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఈడీ విచారణ సందర్భంగా హేమంత్ సోరెన్ నివాసం దగ్గర 1000 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 14 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. అక్రమంగా మైనింగ్ లీజుల్లో ల్యాండ్ స్కాం జరిగిందని ఈడీ ఆరోపిస్తోంది.
#WATCH | Security strengthened as additional Central Security Force troops arrive at the residence of Jharkhand CM Hemant Soren in Ranchi
CM Soren is currently being questioned by a team of ED officials here in connection with a land scam case. pic.twitter.com/xl2S7S66ns
— ANI (@ANI) January 20, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…