JEE, NEET Exams 2021: జేఈఈ, నీట్ పరీక్షల సిలబస్ కుదింపు ..ఆన్‌లైన్‌లో క్లాసులను నిర్వహిస్తామని కేంద్ర మంత్రి స్పష్టం
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది స్కూల్స్ నిర్వహణ పరీక్ష తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది జరగనున్న జేఈఈ, నీట్ పరీక్ష తేదీలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా విద్యార్థులకు పరీక్షల సిలబస్ గురించి తెలియజేసింది.
JEE, NEET Exams 2021: కరోనా నేపథ్యంలో ఈ ఏడాది స్కూల్స్ నిర్వహణ పరీక్ష తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది జరగనున్న జేఈఈ, నీట్ పరీక్ష తేదీలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా విద్యార్థులకు పరీక్షల సిలబస్ గురించి తెలియజేసింది. జేఈఈ, నీట్ పరీక్షల సిలబస్ తగ్గనుందని, విద్యార్థులకు ఆన్‌లైన్ లోనే తరగతి కొనసాగుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ చెప్పారు. సిబిఎస్‌ఇ, జేఈఈ , నీట్ సిలబస్ వివరాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రశ్నలకు రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ సమాధానం ఇచ్చారు.
సోమవారం లైవ్ వెబ్‌నార్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులతో నిశాంక్ మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఒక విద్యార్థి జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ , నీట్ సిలబస్ గురించి ప్రస్తావించాడు. ఆ విద్యార్థి ప్రశ్నకు సమాధానం చెబుతూ.. విద్యార్థులు భయపడాల్సిన పనిలేదని… పరీక్షల్లో సిబిఎస్‌ఇ సిలబస్ నుంచి 30 శాతం తగ్గించామని చెప్పారు. సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు, జేఈఈ మెయిన్ 2021, నీట్ 2021 పరీక్షలకు తగ్గించిన సిలబస్ నుంచే ప్రశ్నలు ఉంటాయని స్పష్టంచేశారు. ఆయా పరీక్షలకు సవరించిన సిలబస్ ఆధారంగానే విద్యార్థులు చదవాల్సి ఉంటుందన్నారు. ఆ భాగం నుంచి మాత్రమే ప్రశ్నలు ఉంటాయని స్పష్టంచేశారు
పాఠశాల ప్రారంభించిన తర్వాత కూడా ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతాయా అని ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ..కేంద్రీయ విద్యాలయాల్లో తరగతులను దశలవారీగా పునఃప్రారంభిస్తామని చెప్పారు. సగం మంది విద్యార్థులు తరగతులకు హాజరైతే.. మిగతా సగం మందికి ఆన్‌లైన్‌లో తరగతులు ఉండేలా నిర్వహిస్తామన్నారు.
అంతేకాదు విద్యార్థులకు నిశాంక్ ఓ బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. కరోనా సమయంలో విద్యార్థుల అనుభవాలను రాయమని చెప్పారు. కరోనా సమయంలో మాత్రమే ఇది సాధ్యమైందని అనిపించినా అనుభవాలని వ్యాసంగా రాసి తనకు పంపమని కోరారు. అలా పంపిన ప్రత్యేక అనుభవాలను ఇతర విద్యార్థులకు పంచుతామని.. వాటిల్లో బెస్ట్ అనుభవాన్ని పంచుకున్న విద్యార్థిని సన్మానిస్తామని చెప్పారు నిశాంక్
Also Read: ఏపీ స్కూళ్లలో టాయిలెట్స్ నిర్వహణ, విద్యార్థుల హాజరు కోసం మొబైల్ యాప్