AP School Mobile App: ఏపీ స్కూళ్లలో టాయిలెట్స్‌ నిర్వహణ, విద్యార్థుల హాజరు కోసం మొబైల్‌ యాప్‌

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్యాశాఖ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్కూళ్లలో టాయిలెట్స్‌ నిర్వహణ, విద్యార్థుల హాజరు కోసం మొబైల్‌ యాప్‌పై సమీక్షించారు...

AP School Mobile App: ఏపీ స్కూళ్లలో టాయిలెట్స్‌ నిర్వహణ, విద్యార్థుల హాజరు కోసం మొబైల్‌ యాప్‌
Follow us

|

Updated on: Jan 18, 2021 | 4:43 PM

AP School Mobile App: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్యాశాఖ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్కూళ్లలో టాయిలెట్స్‌ నిర్వహణ, విద్యార్థుల హాజరు కోసం మొబైల్‌ యాప్‌పై సమీక్షించారు. పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణ అనేది ప్రాధాన్యతా అంశమని.. టాయిలెట్లు లేకపోవటం, ఉన్నవాటిని సక్రమంగా నిర్వహించకపోవటంతో చాలా స్కూల్స్ లో పిల్లలకు హాజరుకావడం లేదని అన్నారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలంటే టాయిలెట్స్ ను ఉత్తమ నిర్వహణ విధానాల ద్వారా పరిశుభ్రమైన టాయిలెట్లను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ఎప్పుడు మరమ్మతు వచ్చినా వెంటనే బాగుచేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు.

టాయిలెట్ల క్లీనింగ్‌పై కేర్‌టేకర్లకు అవగాహన కల్పించాలని.. విద్యాసంస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. పాఠశాలల్లో నాడు-నేడు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఇంగ్లీష్‌ మీడియం ద్వారా అందుబాటులోకి నాణ్యమైన విద్య ను తీసుకొచ్చామని తెలిపారు. విద్యార్థులకు పోషకాహారం కోసం గోరుముద్ద అమలు చేశామని జగన్ చెప్పారు.

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ కార్యదర్శి వై శ్రీలక్ష్మి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వి చినవీరభద్రుడు, సర్వశిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కె వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read: నార్వేలో టీకా తీసుకున్న వృద్ధులు మృతి, ఫైజర్ వ్యాక్సిన్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆస్ట్రేలియా l

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?