AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: పంజాబ్ కింగ్స్ సాధించింది ఏమి లేదు! ట్రోలర్స్ కి దిమ్మదిరిగేలా కౌంటర్ ఇచ్చిన ప్రీతి జింతా  

బాలీవుడ్ నటి మరియు పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింతా, ట్రోల్స్‌కు ధైర్యంగా స్పందిస్తూ తన జట్టుపై ఉన్న అభిమానాన్ని చాటింది. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ జట్టు ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శనతో ముందుకు సాగుతోంది. ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే వచ్చే కీలక మ్యాచ్‌లు గెలవాల్సిన అవసరం ఉంది. అభిమానుల్లో నమ్మకాన్ని పెంచుతున్న పంజాబ్, ఈసారి ట్రోల్స్ నోరు మూయించేలా ఆడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

IPL 2025: పంజాబ్ కింగ్స్ సాధించింది ఏమి లేదు! ట్రోలర్స్ కి దిమ్మదిరిగేలా కౌంటర్ ఇచ్చిన ప్రీతి జింతా  
Preity Zinta
Narsimha
|

Updated on: Apr 29, 2025 | 2:24 PM

Share

ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింతా, ఇటీవల తన ఎక్స్‌ (మునుపటి ట్విట్టర్) ఖాతాలో నిర్వహించిన #PZChat సెషన్‌లో ట్రోల్స్‌కు గట్టి సమాధానం ఇచ్చింది. అభిమానులతో సరదాగా చాటింగ్ చేస్తూ ప్రారంభమైన ఈ సెషన్, ఒక యూజర్ కామెంట్‌తో ఊహించని మలుపు తీసుకుంది. ఒక ట్రోల్, “మీ జట్టు గెలవదు ఖచ్చితంగా” అని వ్యాఖ్యానించడంతో, ప్రీతి స్పందించకుండా ఉండలేకపోయింది. ఆ ట్రోల్‌కు వెంటనే సమాధానం ఇస్తూ, తన జట్టు పట్ల ఉన్న అభిమానాన్ని పరోక్షంగా తెలియజేసింది. ఆమె స్పందన ట్రోల్ నోరు మూయించింది, అభిమానుల మద్దతు పొందింది. పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా, ప్రీతి జింతా వారి పట్ల తన అంకితభావాన్ని ఎప్పటికీ కోల్పోలేదు. ప్రతి ఏడాది జట్టుకు మద్దతుగా మైదానానికి హాజరౌతూ, ఆటగాళ్లకు ధైర్యం చెప్పే ఆమె ప్రవర్తన చాలా మందికి ఆదర్శంగా మారింది.

ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ట్రోలర్స్ నోరు మూయించగలదా?

ఈసారి పంజాబ్ కింగ్స్ మెగా వేలంలో మంచి జట్టును నిర్మించుకుంది. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో ఆడుతున్న ఈ జట్టు 9 మ్యాచుల్లో 5 గెలిచి, 3 ఓడిపోయింది. చివరి మ్యాచ్ వర్షం వల్ల ఫలితం ఇవ్వలేదు. జట్టు ఈసారి సమతుల్యంగా కనిపిస్తోంది, ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నారు. అభిమానులు కూడా ఈసారి విజయం సాధించగలరనే నమ్మకంతో ఉన్నారు. వచ్చే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అట్టడుగు స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌ను ఎదుర్కొంటుంది. టాప్-4లోకి ప్రవేశించాలంటే, మిగతా మ్యాచుల్లో గెలవాల్సిన అవసరం పంజాబ్‌పై ఉంది.

ఐపీఎల్ 2025 సీజన్ మధ్య దశకు చేరుకోవడంతో, ప్లే ఆఫ్స్ రేస్ గట్టి పోటీలో కొనసాగుతోంది. ప్రతి జట్టు తన గేమ్‌ను మెరుగుపరుస్తున్న తరుణంలో, పంజాబ్ కింగ్స్ కూడా గట్టిగానే పోరాడుతోంది. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలో జట్టు గత సీజన్‌ల కంటే మరింత సమతుల్యతతో కనిపిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో యువ ఆటగాళ్లు ఆకట్టుకుంటున్నారు, మరింత విశ్వసనీయత కోసం శ్రేయస్ అయ్యర్ తో పాటు ఓపెనర్ల తో పాటు కీలక ఆటగాళ్లు తమ సమర్థతను నిరూపించాలి. బౌలింగ్ విభాగంలో అర్షదీప్ సింగ్, కాగిసో రబాడా వంటి స్టార్ బౌలర్లు జట్టుకు మద్దతుగా నిలుస్తున్నారు.

పంజాబ్ కింగ్స్ ముఖ్యమైన మ్యాచ్‌లు

పంజాబ్ కింగ్స్‌కు ముందున్న మ్యాచ్‌లు చాలా కీలకం. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌తో జరగబోయే మ్యాచ్‌లు ప్లే ఆఫ్స్ అవకాశాలను నిర్ధారించవచ్చు లేదా దెబ్బతీసే అవకాశం ఉంది. ఏ ఒక్క ఓటమీ టైటిల్ కలను దూరం చేయొచ్చు. ప్రీతి జింతా జట్టుపై చూపుతున్న అంకితభావం అభిమానులలో నమ్మకాన్ని పెంచుతోంది. ఈసారి పంజాబ్ కింగ్స్ అనూహ్యంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుందా అన్నది ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..