మే తొలి వారం థియేటర్స్‎లో సందడికి సిద్దమైన సినిమాలు ఇవే.. 

29 April 2025

Prudvi Battula 

ప్రతి శుక్రవారం ప్రేక్షకుల ముందుకి సినిమాలు రావడం ఆనవాయితీ. అయితే ఈ వారం ఆలా కాదు.. ఒక్క రోజు ముందు అంటే మే 1నే విడదలకి రెడీగా ఉన్నాయి.

నాని హీరోగా రూపొందిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'హిట్: ది థర్డ్ కేస్' మే 1న థియేటర్స్‎లో సందడి చేయనుంది.

సూర్య హీరోగా రొమాంటిక్ యాక్షన్ మూవీ 'రెట్రో' మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో పూజ హెగ్డే హీరోయిన్.

శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' కామెడీ డ్రామా సినిమా మే 1న విడుదల కానుంది.

మే 1న బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ 'రైడ్ 2' సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు అజయ్ దేవ్‌గన్, రితేష్ దేశముఖ్.

సంజయ్ దత్, సన్నీ సింగ్, మౌని రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ది భూత్నీ' అనే బాలీవుడ్ హర్రర్-కామెడీ మూవీ మే 1న రానుంది.

మలయాళీ నటుడు ప్రధాన పాత్రలో నటించింది కామెడీ డ్రామా మూవీ 'అభ్యంతర కుట్టవాలి' మే 1న విడుదల కానుంది.

మార్వెల్ కామిక్స్ ఆధారంగా రూపొందిన అమెరికన్ సూపర్ హీరో చిత్రం 'థండర్ బోల్ట్స్' మే 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమైంది.