AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లడఖ్‌లో ఘోరం.. మంచులో కూరుక్కుపోయి ఏడుగురు మృతి, మరికొందరికి సీరియస్!

లడఖ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. హిమపాతం సంభవించడంతో ఏడుగురు మరణించారు. శుక్రవారం (మార్చి 27) జోజిలా పాస్‌లోని జీరో పాయింట్ వద్ద ఈ ఘటన జరిగింది. మరికొందరు చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారీ మంచు కింద ఐదు వాహనాలు కూరుకుపోవడంతో రిస్క్యూ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించారు.

లడఖ్‌లో ఘోరం.. మంచులో కూరుక్కుపోయి ఏడుగురు మృతి, మరికొందరికి సీరియస్!
Avalanche Hit The Zojila Pass
Balaraju Goud
|

Updated on: Mar 28, 2026 | 8:28 AM

Share

లడఖ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. హిమపాతం సంభవించడంతో ఏడుగురు మరణించారు. శుక్రవారం (మార్చి 27) జోజిలా పాస్‌లోని జీరో పాయింట్ వద్ద ఈ ఘటన జరిగింది. మరికొందరు చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారీ మంచు కింద ఐదు వాహనాలు కూరుకుపోవడంతో రిస్క్యూ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించారు.

అకస్మాత్తుగా, తీవ్రంగా సంభవించిన ఈ హిమపాతం అనేక వాహనాలను కబళించింది. వాటిలోని ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారని, మరో ఐదుగురు గాయపడ్డారు. ఇంకొక వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియరాలేదని అధికారి తెలిపారు. జోజిలా పాస్‌లోని జీరో పాయింట్ ప్రదేశంలో వాహనాలపై మంచు చరియలు పడ్డాయి. దీంతో హిమపాతంలో చిక్కుకోవడంతో ఆరు మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒక వ్యక్తి గల్లంతయ్యాడు . మరో ఐదుగురు గాయపడ్డారు. జీరో పాయింట్ వద్ద హిమపాతానికి గురైన వాహనాల్లో ఒక ప్రయాణీకుల వాహనం కూడా ఉంది. దానివల్లే అక్కడికక్కడే మరణాలు సంభవించాయని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని వైద్య కేంద్రాలకు తరలించారు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గందర్‌బల్ పోలీసులు, విపత్తు నిర్వహణ అధికారులతో కలిసి, వాహనాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రిస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ప్రమాదానికి గురైన ఆ వాహనాలు జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి కార్గిల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

జోజిలా కనుమ హిమాలయాల్లోని ఒక ఎత్తైన పర్వత మార్గం. ఇది కాశ్మీర్ లోయను లడఖ్‌తో కలుపుతుంది. ఇది శ్రీనగర్ – లేహ్ మధ్య జాతీయ రహదారి 1పై సుమారు 3,528 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ కనుమ దాని నిటారుగా, ఇరుకైన రహదారులకు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ కురిసే భారీ హిమపాతం, తరచుగా సంభవించే హిమసంపాతాల కారణంగా శీతాకాలంలో ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తారు.

జోజిలా వ్యూహాత్మకంగా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది లడఖ్‌కు పౌర రవాణా, సైనిక సరఫరా మార్గాలకు కీలకమైన మార్గంగా పనిచేస్తుంది. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా స్పందిస్తూ, తాను స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నానని, విపత్తు నిర్వహణ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) సహా ప్రభుత్వ సంస్థలు సహాయక, రెస్క్యూ ఆపరేషన్లలో నిమగ్నమై ఉన్నాయని తెలిపారు. “జోజి లా వద్ద హిమసంపాతం సంభవించిన దురదృష్టకర వార్త విన్నాను. వెంటనే సంఘటనా స్థలాన్ని సందర్శించి, సహాయక, రెస్క్యూ ఆపరేషన్లను ప్రారంభించాలని కార్గిల్ డీసీ, ఎస్ఎస్పీలను ఆదేశించాను. విపత్తు సహాయక దళాలు, బీఆర్ఓతో సహా అన్ని ప్రభుత్వ సంస్థలను హై అలర్ట్‌లో ఉంచాను. వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాను,” అని సక్సేనా సోషల్ మీడియా Xలో ఒక పోస్ట్‌లో రాశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us