ఫామ్ నుంచి తప్పించుకున్న 900 పాములు భయంతో వణికిపోతున్న స్థానికులు
దక్షిణ చైనాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదల్లో ఓ పాముల పెంపకం కేంద్రం ధ్వంసమైంది. దీంతో దాదాపు 900 పాములు సమీప గ్రామాలు, జనావాసాల్లోకి చేరడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. విషపూరిత నాగుపాములు కూడా ఉండటంతో అధికారులు అప్రమత్తమై ప్రత్యేక బృందాలతో పాముల వేట చేపట్టడంతో పాటు ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు.
దక్షిణ చైనాలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వరదల ధాటికి అక్కడ ఓ గ్రామంలో ఉన్న పాముల పెంపకం కేంద్రం గోడలు కూలిపోయాయి. దీంతో ఫామ్‌లో పెంచుతున్న సుమారు 900 పాములు వరద నీటితో పాటు సమీప గ్రామాల్లోకి, జనావాసాల్లోకి కొట్టుకొచ్చాయి. వీటిలో అత్యంత విషపూరితమైన నాగుపాము వంటివి కూడా ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. పాములు ఇళ్లలోకి, పొలాల్లోకి చేరుతుండటంతో అధికారులు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఇప్పటికే ఈ పాముల కాటుకు గురైన కొందరిని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అటవీ శాఖ ప్రత్యేక బృందాలను, స్నేక్ క్యాచర్లను రంగంలోకి దించి పాములను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. వరద ఆస్తి నష్టానికి తోడు, ఇప్పుడు ఈ పాముల భయం తోడవడంతో స్థానికులు తీవ్రంగా ఆందోళన చెదుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టైరు పంక్చర్ అయి బోల్తాపడ్డ రిక్షా.. డబ్బాలు, బాటిళ్ళతో ఎగబడిన జనం
పానీపూరీ కోసం 12 ఏళ్ల పోరాటం..
బెంగళూరు ఓపెన్ జిమ్‌లో వింత దృశ్యం..
Amarnath Ice Lingam: అమర్‌నాథ్ భక్తులకు నిరాశ.. ఇక మంచు లింగం కనిపించదా!
అప్పు చేసి కడుతున్నాను బ్రో.. నిర్మాణంలో ఉన్న ఇంటికి ఆసక్తికర ఫ్లెక్సీ.. చూస్తే నవ్వాగదు
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్!
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత
ఫ్రిజ్ ఓపెన్ చేయడానికి వెళ్లిన మహిళ.. సీన్ చూసి గుండె గుభేల్
పుంగనూరు గిత్తా మజాకా.. ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్

