ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్‌తో ఎవరికి లాభం? E-20 అమలుపై దేశవ్యాప్తంగా రచ్చోరచ్చస్య..
పర్యావరణ పరిరక్షణ, ముడిచమురు దిగుమతుల తగ్గింపు, రైతుల ఆదాయం పెంపు లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వినియోగాన్ని వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే E10 విజయవంతం కావడంతో ఇప్పుడు E20 అమలుపై దృష్టి పెట్టింది. అయితే మైలేజ్ తగ్గడం, పాత వాహనాల పనితీరుపై ప్రభావం, ఇంజిన్ భాగాల నష్టంపై వాహనదారుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు స్వచ్ఛమైన ఇంధన విప్లవంగా ప్రభుత్వం ప్రచారం చేస్తుండగా, మరోవైపు ఇది వాహనదారులపై ప్రయోగంగా మారుతుందా అనే చర్చ దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది.

2005లో అంటే 20 ఏళ్లకిందట రిలీజైన కర్బన ఉద్గారాల కంటే 45 శాతం తగ్గించుకోవాలి… అదికూడా 2030లోగా ఆ టార్గెట్‌ని రీచవ్వాలి… గాలికాలుష్యం కోరలనుంచి విడిపడి ప్రపంచం స్వచ్ఛవాయువులు పీల్చుకోడానికి ఇదొక్కటే మార్గం. 2015 డిసెంబర్‌లో పారిస్‌లో జరిగిన క్లయిమేట్ ఛేంజ్ కాన్ఫరెన్స్‌లో చేసుకున్న డీల్ ఇది. అప్పుడు సంతకం చేసిన 195 దేశాల్లో ఇండియా కూడా ఉంది. పారిస్ ఒప్పందం అమలుదిశగా పరుగులు పెడుతోంది ఇండియా. గత పదేళ్లలో జనంలో ఎకోఫ్రెండ్లీ ఆలోచన పెరిగి, 33 శాతం దాకా కర్బన ఉద్గారాలు తగ్గిపోయాయి. కానీ, వాహనాల నుంచి విడుదలయ్యే పొల్యూషన్ మాత్రం జస్ట్ 4 శాతానికి మించి తగ్గడం లేదు. అటు, విచ్చలవిడిగా ఎరువుల వాడకం, పంట అవశేషాలను కాల్చడం లాంటి పరిణామాలు వాయుకాలుష్యాన్ని అడ్డూఅదుపూ లేకుండా పెంచుతున్నాయి. 2030కి మరో నాలుగేళ్లు మాత్రమే గ్యాపుంది. అందుకే, మోదీ సర్కార్‌కి పారిస్ డీల్ మళ్లీ గుర్తుకొచ్చిందో ఏమో, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ పేరుతో భారీ ప్రయత్నాన్ని దేశం ముందు ఉంచింది. కానీ, ఇది అలవి కాని పని.. పైగా ప్రమాదకరం. దీనికోసం ఇండియా మొత్తాన్ని ఒక ప్రయోగశాలగా మార్చేస్తారా? అని తిరగబడుతోంది యావత్ వాహనదారుల సమాజం. 10 శాతం ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ వాడకం మన దేశంలో విజయవంతమైంది. నిర్దేశిత గడువు కంటే ఐదునెలల ముందే E10 టార్గెట్‌ని ఈజీగా రీచైపోయాం.. అదీ మనకుండే కమిట్‌మెంట్. సరిగ్గా ఐదేళ్ల కిందట ప్రపంచ పర్యావరణ...
