AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: సర్‌ప్రైజ్‌ మామూలుగా ఉండదు... బన్నీ కోసం బిగ్ ప్లాన్ రెడీ చేస్తున్న లోకేష్‌

Allu Arjun: సర్‌ప్రైజ్‌ మామూలుగా ఉండదు… బన్నీ కోసం బిగ్ ప్లాన్ రెడీ చేస్తున్న లోకేష్‌

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 11, 2026 | 4:00 PM

Share

‘కూలీ’ తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన తదుపరి చిత్రం ‘AA23’పై ఫుల్ ఫోకస్ పెట్టారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి ప్రత్యేక టీజర్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ‘విక్రమ్’, ‘లియో’ తరహాలోనే భారీ హైప్ క్రియేట్ చేసేలా ఈ ప్రమోషనల్ వీడియోను రూపొందించేందుకు లోకేష్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

కూలీ తరువాత బ్రేక్‌ తీసుకున్న లోకేష్ కనగరాజ్‌, నెక్ట్స్‌ మూవీని ఐకాన్‌ స్టార్‌తో చేయబోతున్నారు. ఆల్రెడీ ఎనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చిన మేకర్స్ ఆ టీజర్‌తోనే నయా రికార్డ్స్ సెట్ చేశారు. ఇప్పుడు తన స్టైల్‌లో మరో క్రేజీ అప్‌డేట్ ప్లాన్ చేస్తున్నారు. గతంలో కమల్‌, రజనీ, విజయ్‌ సినిమాల మీద హైప్‌ పెంచిన సేమ్‌ ఫార్ములాను బన్నీ మూవీ విషయంలోనూ రిపీట్ చేస్తున్నారు. స్టార్ హీరోలతో క్రేజీ మూవీస్ చేసిన లోకేష్ కనగరాజ్‌ ఆ సినిమాల ఎనౌన్స్‌మెంట్‌ను కూడా అదే రేంజ్‌లో ప్లాన్ చేశారు. సినిమా కథతో సంబంధం లేకుండా ఎనౌన్స్‌మెంట్ కోసమే టీజర్స్‌ను షూట్ చేసి రిలీజ్ చేశారు. విక్రమ్‌, లియో, కూలీ సినిమాల విషయంలో ఆ టీజర్స్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఇదే ఫార్ములాను బన్నీ సినిమా కోసం కూడా రిపీట్ చేస్తున్నారు. తన గత చిత్రాలతో పోలిస్తే ఏఏ 23ని మరింత స్పెషల్‌గా ట్రీట్ చేస్తున్న లోకేష్‌. తొలి టీజర్‌ కోసం డిఫరెంట్ కాన్సెప్ట్స్ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఎనౌన్స్‌మెంట్ టీజర్‌ సోషల్ మీడియాలో నయా రికార్డ్స్‌ సెట్ చేసింది. నెక్ట్స్ టీజర్‌తో ఆ రికార్డ్‌లను బ్రేక్ చేయాలన్న ప్లాన్‌లో ఉన్నారు లోకేష్‌. ప్రజెంట్‌ ముంబైలో రాకా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్‌. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే లోకేష్‌ మూవీ కోసం బన్నీ షార్ట్ టైమ్‌ కేటాయించే ఛాన్స్ ఉంది. ఈ లోగా కాన్సెప్ట్ రెడీ అయితే ఈ గ్యాప్‌లోనే షూటింగ్ కూడా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారు లోకేష్‌. అంతేకాదు అన్ని ఆన్‌ టైమ్ జరిగితే ఈ నెలలోనే ఆ వీడియోను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. పుష్ప 2తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బన్నీ ప్రజెంట్ గ్లోబల్ రేంజ్‌లో తెరకెక్కుతున్న రాకా మూవీలో నటిస్తున్నారు. ఆ సినిమా పూర్తయిన తరువాత లోకేష్‌ మూవీ సెట్‌లో అడుగుపెడతారు. రాకా రేంజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఏఏ 23ని ప్లాన్ చేస్తున్నారు లోకేష్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏంటి? పవన్‌ సినిమాలో ఛాన్స్ వస్తే వదులుకుందా?

V. V. Vinayak: ఆ సినిమా చేసి తప్పు చేశా.. వినాయక్ భావోద్వేగం

Naga Durga: బిగ్ బాస్‌ బంపర్ ఆఫర్.. కానీ.. ఇడుపు కాయితం ఫేమ్ నాగ దుర్గ షాకింగ్ రీజన్

Naga Vamsi: బుక్‌మైషో బండారం బయటపెట్టిన నాగ వంశీ..

బిగ్ స్క్రీన్ మీద బిగ్ చేంజ్‌… ఆడియన్స్‌ టేస్ట్ మారుతోందా..?

Follow Us