AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND sv ENG: ప్రపంచ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ డేంజరస్ జోడీ.. బద్దలైన మైలురాళ్లు ఇవే..!

Harry Brook Jos Buttler World Record: ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ల విధ్వంసానికి టీమిండియా బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. బట్లర్, బ్రూక్ నెలకొల్పిన ఈ చారిత్రాత్మక రికార్డులు అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ కాలం పాటు నిలిచిపోతాయి. ఈ ఘోర పరాజయం తర్వాత భారత్ తన లోపాలను సరిదిద్దుకుని తదుపరి సిరీస్‌లలో ఎలా పుంజుకుంటుందో చూడాలి.

IND sv ENG: ప్రపంచ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ డేంజరస్ జోడీ.. బద్దలైన మైలురాళ్లు ఇవే..!
Harry Brook Jos Buttler World Record
Venkata Chari
|

Updated on: Jul 12, 2026 | 7:54 AM

Share

Harry Brook Jos Buttler World Record: సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్లు జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ సిక్సర్లు, ఫోర్లతో మైదానాన్ని తగలబెట్టారు. భారత బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ ఈ జోడీ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. టీమిండియాపై 56 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 4-0తో క్లీన్‌స్వీప్ చేయడమే కాకుండా, అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే పలు అరుదైన మైలురాళ్లను ఈ జోడీ బద్దలు కొట్టింది. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.

టీ20 చరిత్రలోనే సంచలన భాగస్వామ్యం..

మొదటి వికెట్ పడిన తర్వాత జతకలిసిన జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ రెండో వికెట్‌కు కేవలం 102 బంతుల్లోనే ఏకంగా 233 పరుగుల సునామీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో రెండో వికెట్‌కు ఇదే అత్యధిక పరుగుల వరల్డ్ రికార్డ్ భాగస్వామ్యం. గతంలో 2024లో దక్షిణాఫ్రికాపై సంజూ శాంసన్, తిలక్ వర్మ నెలకొల్పిన 210 పరుగుల రికార్డును వీరు అధిగమించారు. ఫుల్ మెంబర్ దేశాల పరంగా చూస్తే ఏ వికెట్‌కైనా ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యంగా నిలిచింది.

జోస్ బట్లర్ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్.. సరికొత్త రికార్డులు..

ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ ఈ మ్యాచ్‌లో శివతాండవం చేశాడు. కేవలం 64 బంతుల్లోనే 12 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 131 పరుగులు చేసి కెరీర్ బెస్ట్ స్కోరును నమోదు చేశాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్‌పై ఒక బ్యాటర్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే కావడం విశేషం. బట్లర్ తన టీ20 కెరీర్‌లో నమోదు చేసిన టాప్ స్కోర్ల వివరాలు:

131 పరుగులు – వర్సెస్ భారత్ (సౌతాంప్టన్, 2026, నేడు)

124 పరుగులు – రాజస్థాన్ రాయల్స్ తరఫున వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఢిల్లీ, 2021)

116 పరుగులు – రాజస్థాన్ రాయల్స్ తరఫున వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (ముంబై, 2022)

సెంచరీ చేజార్చుకున్నా.. చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్..

మరోవైపు ఇంగ్లాండ్ ప్రస్తుత కెప్టెన్ హ్యారీ బ్రూక్ కేవలం 45 బంతుల్లోనే 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 95 పరుగులతో నాటౌట్‌గా నిలిచి తృటిలో సెంచరీ మార్క్‌ను మిస్ అయ్యాడు. అయితే, అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 3వ నంబర్ లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బ్రూక్ టాప్-3 స్థానాన్ని ఆక్రమించాడు.

124* రన్స్ – షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా), సిడ్నీ, 2016

98 రన్స్ – క్రిస్ గేల్ (వెస్టిండీస్), బ్రిడ్జ్‌టౌన్, 2010

95* రన్స్ – హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్), సౌతాంప్టన్, 2026 (నేడు)

95 రన్స్ – కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), హామిల్టన్, 2020

అలాగే హ్యారీ బ్రూక్ టీ20 కెరీర్‌లో ఇది రెండో అత్యుత్తమ స్కోరు. అతని అత్యధిక స్కోర్ల జాబితా:

100 పరుగులు – వర్సెస్ పాకిస్తాన్ (పల్లెకెలె, 2026)

95* పరుగులు – వర్సెస్ భారత్ (సౌతాంప్టన్, 2026, నేడు)

81* పరుగులు – వర్సెస్ పాకిస్తాన్ (కరాచీ, 2022).

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us