AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NHSRCL బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో భారీగా ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.1.10 లక్షల జీతం! టెన్త్ పాసైతే చాలు

దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌గా గుర్తింపు పొందిన ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్‌ను అమలు చేస్తున్న నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) 237 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రికల్, సిగ్నలింగ్ అండ్ టెలికాం, సివిల్/ట్రాక్ ఫిట్టర్, మెకానిక్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), పత్రాల ధృవీకరణ, వైద్య పరీక్షల ద్వారా జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.35,000 నుంచి రూ.1.10 లక్షల వరకు వేతనం అందించనున్నారు..

NHSRCL బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో భారీగా ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.1.10 లక్షల జీతం! టెన్త్ పాసైతే చాలు
NHSRCL Bullet Train Project Recruitment
Srilakshmi C
|

Updated on: Jul 12, 2026 | 7:49 AM

Share

భారతదేశ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌గా గుర్తింపు పొందిన ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్న నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) భారీ ఉద్యోగ నియామకాలను ప్రకటించింది. వివిధ సాంకేతిక విభాగాల్లో మొత్తం 237 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 5, 2026 వరకు NHSRCL అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకాల ద్వారా ఎలక్ట్రికల్ టెక్నీషియన్, సిగ్నలింగ్ అండ్ టెలికాం టెక్నీషియన్, సివిల్/ట్రాక్ ఫిట్టర్, మెకానిక్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, సర్వేయర్, వెల్డర్, ప్లంబర్, పెయింటర్, రోలింగ్ స్టాక్ టెక్నీషియన్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.

NHSRCL బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

విభాగాల వారీగా వివరాలు..

ఎలక్ట్రికల్ టెక్నీషియన్ పోస్టులు 77 ఉండగా, సిగ్నలింగ్ అండ్ టెలికాం టెక్నీషియన్ పోస్టులు 63 ఉన్నాయి. సివిల్/ట్రాక్ ఫిట్టర్ పోస్టులు 18, సివిల్/ట్రాక్ మెకానిక్ పోస్టులు 16, రోలింగ్ స్టాక్ ఎలక్ట్రీషియన్ పోస్టులు 13, రోలింగ్ స్టాక్ ఫిట్టర్ పోస్టులు 10 ఉన్నాయి. మిగిలిన ఖాళీలు ఇతర సాంకేతిక విభాగాల్లో భర్తీ చేయనున్నారు.

అర్హతలు

అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్/ఎస్సెస్సీ పూర్తి చేసి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ లేదా అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. లేదా సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో మూడేళ్ల డిప్లొమా కలిగి ఉండాలి. అదనంగా, ఇండియన్ రైల్వేస్, మెట్రో రైల్, ప్రభుత్వ ఆధ్వర్యంలోని రైల్వే వ్యవస్థలు లేదా రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరి. గరిష్ఠ వయోపరిమితి 35 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్ట్ 5, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రుసుము మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం

అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), పత్రాల ధృవీకరణ మరియు వైద్య పరీక్షల ఆధారంగా జరుగుతుంది. అన్ని పోస్టులకు ఒకే రోజు, ఒకే సమయంలో CBT నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది ప్రొబేషన్ కాలాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులను NE-2 పే స్కేల్ కింద నియమించనున్నారు. నెలకు రూ.35,000 నుంచి రూ.1,10,000 వరకు వేతనం లభించనుంది. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు NHSRCL విడుదల చేసిన పూర్తి నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా పరిశీలించాలని అధికారులు సూచించారు.

NHSRCL బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
ఉదయం ఈ 5 ఫుడ్స్ తింటే రోజంతా ఫుల్ ఎనర్జీ.. కానీ ఈ ఆహారాలను మాత్రం
ఉదయం ఈ 5 ఫుడ్స్ తింటే రోజంతా ఫుల్ ఎనర్జీ.. కానీ ఈ ఆహారాలను మాత్రం
వంద ఏనుగుల బలం అతి త్వరగా తెప్పించే డైమండ్ ఫుడ్ ఇదే..
వంద ఏనుగుల బలం అతి త్వరగా తెప్పించే డైమండ్ ఫుడ్ ఇదే..
పైకి చూస్తే చాక్లెట్ ప్యాకెట్స్.. అనుమానం వచ్చి ఓపెన్ చేయగా..
పైకి చూస్తే చాక్లెట్ ప్యాకెట్స్.. అనుమానం వచ్చి ఓపెన్ చేయగా..
ఇంట్లోనే శివుడికి జలాభిషేకం ఎలా చేయాలి? పూర్తి విధానం, నియమాలు..
ఇంట్లోనే శివుడికి జలాభిషేకం ఎలా చేయాలి? పూర్తి విధానం, నియమాలు..
ఉగ్ర దావానలంలో పాకిస్థాన్:నెల రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారంటే
ఉగ్ర దావానలంలో పాకిస్థాన్:నెల రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారంటే
కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా?ఇది శుభమా? అశుభమా
కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా?ఇది శుభమా? అశుభమా
నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు
నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు
అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..!
అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..!
కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్
కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్
ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ..
ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ..